పూరీ - ఎన్టీఆర్ 'టెంపర్' ఫస్ట్లుక్ లీక్! | junior ntr temper first look leaked | Sakshi
Sakshi News home page

పూరీ - ఎన్టీఆర్ 'టెంపర్' ఫస్ట్లుక్ లీక్!

Published Wed, Nov 26 2014 3:47 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

పూరీ - ఎన్టీఆర్ 'టెంపర్' ఫస్ట్లుక్ లీక్! - Sakshi

పూరీ - ఎన్టీఆర్ 'టెంపర్' ఫస్ట్లుక్ లీక్!

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న 'టెంపర్' ఫస్ట్లుక్ విడుదలైంది. అయితే, అటు దర్శకుడు పూరీ గానీ, నిర్మాత బండ్ల గణేశ్ గానీ దీన్ని విడుదల చేయలేదు. నేరుగా దర్శకుడు పూరీ జగన్నాథ్ ఎడిట్ సూట్ దగ్గర నుంచి లీకైపోయింది!! లీక్ చేసింది కూడా ఎవరో కాదు.. సాక్షాత్తు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ భార్య పోనీవర్మ. దర్శకుడి నుంచి ఎడిటర్ల వరకు అందరూ ఎడిటింగ్ రూంలో చాలా బిజీగా ఉన్న సమయంలో ఆమె అక్కడి నుంచే ఈ పోస్టర్ను లీక్ చేసి, తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అదే విషయాన్ని ఆమె తన ట్వీట్లో కూడా పేర్కొన్నారు.

నేరుగా పూరీజగన్ ఎడిటింగ్ సూట్ దగ్గర నుంచే ఈ ఫొటో పెడుతున్నానని, అందులో చాలా అద్భుతమైన రషెస్ ఉన్నాయని ఆమె చెప్పారు. తారక్ ఈ సినిమాలో చాలా బాగా ఉన్నారని చెప్పారు. ఇలా అనుకోకుండా టెంపర పోస్టర్ వచ్చేయడంతో ఎన్టీఆర్ అభిమానులంతా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఆ ఫొటోతో హల్చల్ చేస్తున్నారు. ఈ వారాంతంలో అధికారికంగా సినిమా ఫస్ట్ లుక్ విడుదల అవుతుందని చెబుతున్నారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పవర్ఫుల్ పోలీసు అధికారి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఆయన పక్కన బృందావనం జంట కాజల్ అగర్వాల్ మరోసారి నటిస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement