హైదరాబాద్‌లో టెంపర్‌ రీమేక్‌ షురు | Temper Remake Simmba Starts Shooting At Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో టెంపర్‌ రీమేక్‌ షురు

Published Wed, Jun 6 2018 7:59 PM | Last Updated on Tue, Sep 4 2018 5:48 PM

Temper Remake Simmba Starts Shooting At Hyderabad - Sakshi

సింబా షూటింగ్‌ స్పాట్‌లో రోహిత్‌ శెట్టి, రణ్‌వీర్‌ సింగ్‌, సారా అలీఖాన్‌, కరణ్‌ జోహర్‌

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా రూపొందించిన చిత్రం టెంపర్‌.. ఈ సినిమా నటుడిగా ఎన్టీఆర్‌ కు ఎంతో మంచి పేరు తీసుకువచ్చింది.  నిర్మాత కరణ్‌ జోహార్‌ ఈ సినిమాను బాలీవుడ్‌ లో రణవీర్‌ సింగ్‌ హీరోగా రీమేక్‌ చేస్తున్నారనే సంగతి తెలిసిందే. రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి సింబా అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. సినిమాలో రణ్‌వీర్‌ సింగ్‌కు జోడిగా సైఫ్‌ అలీఖాన్‌ కూతురు సారా అలీఖాన్ నటిస్తున్నారు. సారా ఈ చిత్రం ద్వారానే బాలీవుడ్‌లోకి అడుగుపెడుతుంది.  

ఈ ప్రాజెక్ట్‌కు ఎప్పుడో రూపకల్పన చేసినప్పటికీ.. పట్టాలెక్కెందుకు చాలా సమయమే తీసుకుంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముందుగా అనుకున్నట్టే డిసెంబర్‌ 28న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. షూటింగ్‌ స్పాట్‌లో రణ్‌వీర్‌ సింగ్‌, సారా అలీఖాన్‌, రోహిత్‌ శెట్టి, కరణ్‌ జోహర్‌ కలసి దిగిన ఫొటోను కరణ్‌ అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా సింబా షూటింగ్‌కు సంబంధించిన ఓ ఫన్నీ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement