టెంపర్‌ రీమేక్‌లో స్టార్‌ డాటర్‌ | Jhanvi Kapoor in Temper bollywood remake | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 26 2018 2:21 PM | Last Updated on Fri, Jan 26 2018 2:21 PM

Jhanvi Kapoor in Temper bollywood remake - Sakshi

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా రూపొందింన సూపర్‌ హిట్ సినిమా టెంపర్‌. నటుడిగా ఎన్టీఆర్‌ కు ఎంతో మంచి పేరు తీసుకువచ్చిన ఈ సినిమాను బాలీవుడ్‌ లో రణవీర్‌ సింగ్‌ హీరోగా రీమేక్ చేస్తున్నారు. మాస్‌ యాక్షన్‌ సినిమాల దర్శకుడు రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌ గా ఓ స్టార్ వారసురాలు నటించనుందట. సింబా అనే టైటిల్‌ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్‌ హీరోయిన్‌ గా అలరించనుంది.

తెలుగులో కాజల్‌ కనిపించిన పాత్రలో జాన్వీ నటించనుంది. అయితే ప్రస్తుతానికి జాన్వీ నటిస్తున్నట్టుగా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించకపోయినా.. ఈ రీమేక్‌ ను కరణ్‌ జోహార్ నిర్మిస్తుండటంతో జాన్వీ నటించటం ఖాయం అన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement