
రూమర్లకు చెక్ పడింది. ఇప్పటికైనా ఓ క్లారిటీ వచ్చింది. ఏ విషయంలో? అనేగా మీ డౌట్. కథానాయిక విషయంలో అన్నమాట. ఎన్టీఆర్–పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘టెంపర్’ ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఈ చిత్రాన్ని రణ్‌వీర్ సింగ్ హీరోగా బాలీవుడ్‌లో ‘సింబా’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయిక ఎవరనే విషయంపై చాన్నాళ్లుగా పలు రూమర్లు వినిపిస్తున్నాయి. హీరోయిన్ ఎవరన్నది చిత్రబృందం అధికారికంగా ప్రకటించడంతో రూమర్లకు ఫుల్‌స్టాప్ పడింది.
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ ‘సింబా’ చిత్రంలో రణ్‌వీర్‌సింగ్‌తో జోడీ కడుతున్నారు. అలనాటి అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ ‘సింబా’ చిత్రంలో నటించనున్నారనే వార్తలు చాలా రోజులు బాలీవుడ్‌లో హల్‌చల్ చేశాయి. తాజాగా ‘ఒరు అదార్ లవ్’ ఫేమ్ ప్రియాప్రకాశ్ పేరు తెరపైకి వచ్చింది. తమ చిత్రంలో కథానాయికగా సారా అలీఖాన్ నటించనున్నారంటూ కరణ్ జోహార్, రోహిత్ శెట్టి ప్రకటించి, సారాతో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఏడాది డిసెంబరు 28న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం అభిషేక్ కపూర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కేదార్‌నాథ్’ చిత్రంలో నటిస్తున్నారు సారా.
Comments
Please login to add a commentAdd a comment