ఇప్పుడు మీ అందరికీ ఆనందమేగా? | Yes, I'm single, says Deepika Padukone | Sakshi
Sakshi News home page

ఇప్పుడు మీ అందరికీ ఆనందమేగా?

Jan 20 2014 12:12 AM | Updated on Sep 2 2017 2:47 AM

ఇప్పుడు మీ అందరికీ ఆనందమేగా?

ఇప్పుడు మీ అందరికీ ఆనందమేగా?

ఇప్పటివరకు దీపికా పదుకొనే సాగించిన ప్రేమాయణాల జాబితా ఇది. సిద్ధార్ధ్ నుంచి విడిపోయిన తర్వాత రణబీర్‌తో లవ్‌లో పడ్డ దీపికా ఈసారి పెళ్లి పీటల మీద కూర్చుంటారని చాలామంది ఊహించారు.

సిద్ధార్ధ్ మాల్యా... తొలి ప్రేమికుడు
 రణబీర్ కపూర్... మలి ప్రేమికుడు
 రణవీర్ సింగ్... మూడో ప్రేమికుడు.
 
 ఇప్పటివరకు దీపికా పదుకొనే సాగించిన ప్రేమాయణాల జాబితా ఇది. సిద్ధార్ధ్ నుంచి విడిపోయిన తర్వాత రణబీర్‌తో లవ్‌లో పడ్డ దీపికా ఈసారి పెళ్లి పీటల మీద కూర్చుంటారని చాలామంది ఊహించారు. కానీ, ఆ ముచ్చట జరగకుండానే రణబీర్‌తో ప్రేమకు టాటా చెప్పేశారు దీపికా. ఇక, గత కొన్నాళ్లుగా రణవీర్‌తో సాగిస్తున్న ప్రేమకు కూడా ఫుల్‌స్టాప్ పెట్టేశారని తెలుస్తోంది. ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఓ పది, పదిహేను రోజులై ఉంటుంది. ఎందుకంటే, ఈ నెల 5న తన పుట్టినరోజుని రణవీర్‌తో కలిసి న్యూయార్క్‌లో జరుపుకున్నారామె. అక్కడే ఏదో జరగకూడనిది జరిగి ఉంటుందని బాలీవుడ్‌వారు భావిస్తున్నారు.
 
  ఎందుకంటే, ఇటీవల ఓ వేడుకలో పాల్గొన్న దీపికా పదుకొనే దగ్గర రణవీర్ ప్రస్తావన తీసుకొచ్చిన పాత్రికేయులతో -‘‘ప్రస్తుతానికి నేను సింగిల్‌గానే ఉన్నా. ఇప్పుడు మీ అందరికీ ఆనందమేగా’’ అని చిరునవ్వులు చిందిస్తూ చెప్పారు. ఆ నవ్వులు చూస్తుంటే.. రణవీర్ నుంచి విడిపోయినందుకు ఆమె చాలా ఆనందంగా ఉన్నారని అర్థమవుతోంది. అందరూ తమ గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి, ఆ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టించాలనే దీపికా అలా చెప్పి ఉంటారన్నది కొంతమంది ఊహ. కానీ, ఈ మధ్య రెండు, మూడు కార్యక్రమాలకు ఇద్దరూ విడివిడిగా వచ్చారని, కనీసం మొహమాటానిక్కూడా పలకరించుకోలేదట. కనీసం ఒకరి మొహం ఒకరు చూసుకోవడానికే ఇష్టపడలేదట. సో.. మూడో ప్రేమకు కూడా దీపికా మంగళం పాడేసినట్లే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement