Alia Bhatt And Ranbir Kapoor Marriage: Deepika Padukone, Katrina Kaif And Other Celebrities Wishes Goes Viral - Sakshi
Sakshi News home page

Ranbir Kapoor Alia Bhatt Marriage: ఆలియా-రణ్‌బీర్‌ పెళ్లి.. మాజీ గర్ల్‌ఫ్రెండ్స్‌ విషెస్‌

Published Fri, Apr 15 2022 11:43 AM | Last Updated on Fri, Apr 15 2022 12:21 PM

Deepika Padukone, Katrina Kaif Wishes To Ranbir-Alia Bhatt On Their Wedding - Sakshi

బాలీవుడ్‌ ప్రేమజంట ఆలియాభట్‌-రణ్‌బీర్‌ కపూర్‌ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇంతకాలం ప్రేమికులుగా కలిసున్న వీళ్లు ఏడడుగులు వేసి కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. గురువారం(ఏప్రిల్‌14)న రణ్‌బీర్‌ కపూర్‌ ఇల్లు బాంద్రాలోని వాస్తులో అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.చదవండి: ఆలియా భట్‌ షాకింగ్‌ నిర్ణయం! అదేంటంటే..

ఇక కొత్త జంటకు నెటిజన్లు సహా పలవురు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే రణ్‌బీర్‌ మాజీ గర్ల్‌ఫ్రెండ్స్‌ దీపికా పదుకోణె, కత్రినా కైఫ్‌లు న్యూ కపుల్‌కి బెస్ట్‌ విషెస్‌ అందజేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేయడం మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది.  

'మీ ఇద్దరికి కంగ్రాట్స్‌.  ఆల్‌ ది లవ్‌ అండ్‌ హ్యాపీనెస్‌' అంటూ కత్రినా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయగా.. జీవితాంతం ప్రేమ, చిరునవ్వు, సంతోషం ఉండాలని కోరుకుంటున్నా అంటూ దీపికా పదుకొణె కామెంట్‌ చేసింది. ప్రస్తుతం వీరిద్దరి పోస్టులు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

కాగా ఆలియా కంటే ముందు రణ్‌బీర్‌.. దీపికా, కత్రినాలతో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. దీపికా రణ్‌వీర్‌ సింగ్‌ను పెళ్లాడితే, కత్రినా విక్కీ కౌశల్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. చదవండి: 'అందుకే ఇలా పెళ్లి చేసుకున్నాం'.. రివీల్‌ చేసిన ఆలియా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement