Deepika Padukone: ఫైనల్లీ ఆ టాటూని తొలగించిన దీపికా పదుకొణె! | Deepika Padukone Finally Gets Rid Of Ranbir Kapoor Tattoo? | Sakshi
Sakshi News home page

Deepika Padukone: దీపికా ఒంటిపై మాజీ ప్రియుడి టాటూ.. ఇప్పుడు కనిపించట్లేదే?

Published Sun, Apr 14 2024 11:23 AM | Last Updated on Sun, Apr 14 2024 11:30 AM

Deepika Padukone Finally Gets Rid Of Ranbir Kapoor Tattoo - Sakshi

బాలీవుడ్‌ బ్యూటిఫుల్‌ కపుల్లో దీపికొ పదుకొణె- రణ్‌వీర్‌ సింగ్‌ జంట ఒకటి. రామ్‌ లీలా సినిమా షూటింగ్‌ సమయంలో ప్రేమలో పడిన ఈ జంట.. 2018 నవంబర్‌ 14న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. త్వరలోనే ఈ బ్యూటీ ఓ బిడ్డకి జన్మనివ్వబోతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దీపికా గర్భం దాల్చిందనే విషయాన్ని రణ్‌వీర్‌ వెల్లడించాడు.

తాజాగా ఈ భామ ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఓ ఫోటో చర్చనీయాంశంగా మారింది. శనివారం దీపికా తన ఇన్‌స్టా ఖాతాలో ఓ ఫోటోని షేర్‌ చేసింది.అందులో ఆమె మెడ కనిపించేలా  వెనుక వైపు తిరిగి ఉంది. గతంలో ఆమె వీపు భాగంపై ఓ టాటూ ఉండేది. ఇప్పుడది కనిపించలేదు. 

ఆ హీరోతో పీకల్లోతు ప్రేమలో 
రణ్‌వీర్‌ సింగ్‌తో పెళ్లి కంటే ముందు దీపికా పదుకొణె మరో స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌తో ప్రేమాయణం కొనసాగించింది. ఈ ఇద్దరి ప్రేమ విషయం బాలీవుడ్‌ అంతా తెలుసు. పెళ్లి కూడా చేసుకుంటారని అంతా భావించారు. కానీ  కారణం ఏంటో తెలియదు కానీ బ్రేకప్‌ చెప్పుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రణ్‌బీర్‌తో స్నేహం ఏర్పడడం..అది కాస్త ప్రేమగా మారడంతో 2018లో పెళ్లి చేసుకున్నారు.

అయితే రణ్‌బీర్‌తో ప్రేమలో ఉన్న సమయంలో దీపికా తన వీపుపై RK(రణ్‌బీర్‌ కపూర్‌ షార్ట్‌ కట్‌) అని టాటూ వేయించుకుంది. పెళ్లి తర్వాత కూడా ఆ టాటూని చెరిపేయలేదు. దీంతో అప్పట్లో ఈ టాటూపై బాలీవుడ్‌లో పెద్ద చర్చే జరిగింది. కానీ దీపికా మాత్రం ఆ టాటూపై స్పందించలేదు. ఇక తాజాగా షేర్‌ చేసిన ఫోటోలో ఆ టాటూ కనిపించకపోవడంతో.. ప్రెగ్నెంట్‌ అయిన తర్వాత దీపికా ఆ టాటూని తొలగించిందనే నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్‌ సరసన కల్కీ 2898 ఏడీ చిత్రంలో నటిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement