'పద్మావత్‌'కు ముహూర్తం ఖరారు.. రిలీజ్‌ డేట్‌ ఇదే! | padmavat movie to be released on this month 25 | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 8 2018 3:56 PM | Last Updated on Mon, Jan 8 2018 3:56 PM

padmavat movie to be released on this month 25 - Sakshi

సాక్షి, ముంబై: ఇటీవల తీవ్ర వివాదాల్లో కూరుకుపోయిన సంజయ్‌ లీలా భన్సాలీ 'పద్మావతి' సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. వివాదాల నేపథ్యంలో 'పద్మావతి' టైటిల్‌ను 'పద్మావత్‌'గా మార్చుకొని ఈ నెల 25న విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర విడుదలకు కేంద్ర సెన్సార్‌ బోర్డు 'సీబీఎఫ్‌సీ' అనుమతి ఇచ్చింది.

మేవాడ రాణి పద్మావతి జీవితకథ ఆధారంగా సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కిన 'పద్మావతి' సినిమాపై కర్ణిసేన నేతృత్వంలోని రాజ్‌పుత్‌లు  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ సినిమా విడుదల ఆగిపోయిన సంగతి తెలిసిందే. రాజ్‌పుత్‌ల ఆగ్రహం నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఈ సినిమా విడుదలపై నిషేధం విధించాయి. దీంతో డిసెంబర్‌ నెలలో రావాల్సిన ఈ సినిమా తాత్కాలికంగా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో సినిమాపై వివాదం తలెత్తకుండా సీబీఎఫ్‌సీ పలు మార్పులు సూచించింది. పలుచోట్ల కత్తెరలు వేసింది. ఇందుకు చిత్ర యూనిట్‌ అంగీకరించింది. సినిమా టైటిల్‌ను 'పద్మావత్‌'గా మార్చేందుకు అంగీకరించింది. దీంతో ఈ నెల 25న సినిమా విడుదలకు లైన్‌ క్లియరైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement