sanjay dutt biopic
-
మంచి చాన్స్ మిస్
మంచి సినిమాలో భాగమయ్యే అవకాశం చేజారినప్పుడు ఏ యాక్టర్ అయినా ఫీల్ అవుతారు. ఇప్పుడు అదే చేస్తున్నారు బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన సంజయ్‌దత్ బయోపిక్ ‘సంజు’ గతేడాది బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో సంజయ్ పాత్రలో రణ్‌బీర్‌సింగ్, సంజయ్ తండ్రి సునీల్ దత్ పాత్రలో పరేష్ రావల్ నటించారు. కానీ సునీల్ దత్ పాత్రలో నటించే అవకాశం తొలుత అక్షయ్ ఖన్నాకు వచ్చింది. ‘‘సంజు సినిమాలో సునీల్ దత్ పాత్రకోసం లుక్ టెస్ట్ చేశారు. ఆ పాత్రకు నేను మిస్ ఫిట్ అని హిరానీ ఫీల్ అయ్యారు. ఇలా మంచి సినిమాలో భాగమయ్యే అవకాశం నాకు దక్కలేదు’’ అని పేర్కొన్నారు అక్షయ్ ఖన్నా. -
మనశ్శాంతిగా ఉండనివ్వరా?.. వర్మపై ఫైర్
విలక్షణ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై సంజయ్ దత్ సోదరి నమ్రతా దత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ దత్ జీవితంపై వర్మ మరో బయోపిక్ తెరకెక్కిస్తానని ఈ మధ్య ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయుధాల కేసు నేపథ్యంలో ఇది ఉండబోతుందని హింట్ కూడా ఇచ్చారు. ‘సంజయ్ వద్దకు ఏకే- 56 రైఫిల్ ఎలా వచ్చింది.. అందుకు దారి తీసిన పరిస్థితుల గురించి పూసగుచ్చినట్లు వివరించే యత్నం చేస్తానని, అందుకు సంజు బాబాతోపాటు కేసును దర్యాప్తు చేసిన అధికారులను సైతం కలిసి కథను రూపొందిస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే నమ్రతా దత్ స్పందించారు. ‘అక్రమాయుధాల కేసు సంజు జీవితంలోని ఓ బాధాకరమైన ఘటన. దాన్ని వర్మ ఎందుకు తవ్వాలనుకుంటున్నారు? ఆర్జీవీ సినిమాల్లో చూపించేదంతా చీకటి కోణాలే. అలాంటప్పుడు బయోపిక్‌తో సంజును క్షోభపెట్టాలనుకుంటున్నారా? మమల్ని మళ్లీ బాధలోకి నెట్టాలని ఆయన చూస్తున్నారా? అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సంజుకి అభ్యంతరం లేకపోతే మాత్రం తాము వర్మ ప్రయత్నానికి అడ్డుతగలబోమని ఆమె స్పష్టం చేశారు. -
షకీల షూటింగ్ షురూ
బాలీవుడ్ హీరో సంజయ్ దత్ బయోపిక్ ‘సంజు’ ఇటీవలే రిలీజైంది. సెన్సేషనల్ స్టార్ సన్నీ లియోన్ బయోపిక్ ‘కరణ్‌జిత్ కౌర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోన్’ను వెబ్‌సిరీస్‌గా రూపొందించారు. ఈ రోజు నుంచి టీవీలో ప్రసారం కానుంది. ఇప్పుడు మరో సెన్సేషనల్ స్టార్ షకీల బయోపిక్ కూడా షూటింగ్‌కు సిద్ధమైంది. షకీల జీవితం ఆధారంగా దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ ఓ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ కానుందని సమాచారం. షకీల బయోపిక్‌లో టైటిల్ రోల్‌ను బాలీవుడ్ భామ రీచా చద్దా చేయనున్నారు. ఈ బయోపిక్‌లో షకీలా సినిమా జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి అడల్ట్ స్టార్‌గా ఎలా ఎదిగారనే విషయాలను ప్రస్తావించనున్నారట. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో రిలీజ్ కానుంది. -
‘ఆయన లేఖ చూసి ఆశ్చర్యానికి లోనయ్యా’
ముంబై : బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘సంజు’. ఇందులో సంజయ్ దత్‌గా రణ్‌బీర్ కపూర్, తండ్రి సునీల్ దత్‌గా పరేష్ రావెల్ నటించారు. సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సందర్భంగా పరేష్ రావెల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో తనకు సునీల్ దత్ రాసిన లేఖ గురించి ప్రస్తావించారు. సునీల్ దత్ చనిపోయే కొద్ది రోజుల ముందు పరేష్‌కు ఓ లేఖ రాశారు. అతను చనిపోయిన రోజు తనకు ఆ లేఖ గురించి తెలిసిందని పరేష్ సునీల్ దత్తో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు. ‘మే 25, 2005న.. నేను ఓ సినిమా షూటింగ్ లో ఉన్నాను. అదే సమయంలో సునీల్ దత్ స్వర్గస్తులయ్యారని తెలిసింది. సునీల్ నివాసానికి వెళుతున్నా, రాత్రి ఇంటికి రావడం ఆలస్యమవుతుందని నా భార్యకు ఫోన్ చేసి చెప్పాను. సునీల్ దత్ నుంచి మీకో ఉత్తరం వచ్చిందని నా భార్య నాకు చెప్పింది. అందులో ఏం రాసుందని అడిగాను. ‘ డియర్ పరేష్ జీ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు, జీవితాంతం సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు, మీ కుటుంబ సంభ్యులు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను’ అని రాసి ఉందని నా భార్య సమాధానమిచ్చింది. నా పుట్టిన రోజు మే 30న కానీ ఐదు రోజు ముందుగానే సునీల్ నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖ రాశారు. సునీల్ జీ, నేను పండగల సమయంలో కూడా ఒకరికొకరం శుభాకాంక్షలు చెప్పుకోం. ఆయన చనిపోవడానికి ముందు ఈ లేఖ నాకు రాయడం ఆశ్చర్యానికి గురిచేసింది’ అని పరేష్ రావెల్ చెప్పుకొచ్చారు. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, పరేష్ రావెల్, మనీషా కోయిరాల, అనుష్క శర్మ, దియా మీర్జా, విక్కీ కౌశల్ తదితరులు నటించారు. ఈ సినిమా ఇప్పటికే దాదాపు రూ.265 కోట్లు వసూళ్లను రాబట్టి, రూ.300కోట్ల క్లబ్లో చేరడానికి రెడీ అవుతోంది. -
‘సంజు’ మూవీ రివ్యూ
టైటిల్ : సంజు జానర్ : బయోపిక్ తారాగణం : రణ్‌బీర్ కపూర్, పరేష్ రావెల్, మనీషా కోయిరాలా, దియా మీర్జా, విక్కీ కౌశల్, అనుష్క శర్మ తదితరులు సంగీతం : ఏఆర్ రెహమాన్ దర్శకత్వం : రాజ్‌కుమార్ హిరాణీ నిర్మాత : విదూ వినోద్ చోప్రా, రాజ్‌కుమార్ హిరాణీ Sanju Telugu Movie Review: బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తున్న తరుణంలో సీనియర్ నటుడు సంజయ్ దత్ జీవితగాథ సంజును ప్రకటించి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాడు దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ. పైగా సక్సెస్ లేక సతమతమవుతున్న యువ హీరో రణ్‌బీర్ కపూర్‌ను సంజు రోల్‌కు తీసుకోవటం ఆశ్చర్యం కలిగించింది. అయితే ట్రైలర్-ప్రొమోల్లో అచ్చం సంజు బాబాల కనిపించిన రణ్‌బీర్.. ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చాడు. భారీ అంచనాల మధ్య సంజు ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సంజుగా రణ్‌బీర్ ఏమేర అలరించాడో చూద్దాం... కథ.. స్టార్ వారసుడిగా బాలీవుడ్లో అడుగుపెట్టి డెబ్యూ చిత్రం(రాకీ)తోనే స్టార్డమ్ సంపాదిస్తాడు సంజు(రణ్‌బీర్ కపూర్). సినీ ప్రస్థానం కొనసాగుతున్న సమయంలోనే డ్రగ్స్ అలవాటు, అక్రమాయుధాల కేసు సంజు(రణ్‌బీర్ కపూర్) జీవితాన్ని కుదిపేస్తాయి. ఆయుధాల కేసులో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తనకు తానుగా లొంగిపోవాలని సంజు భావిస్తాడు. కానీ, అంతకు ముందే తన జీవిత కథగా మలిచేందుకు ప్రయత్నిస్తాడు. రచయిత కోసం ఎదురుచూస్తున్న తరుణంలో విన్నె(అనుష్క శర్మ) ముందుకు వస్తుంది. తన జీవితంలోని ముఖ్య ఘట్టాలను సంజు.. విన్నెకు వివరిస్తూ కథ సాగుతుంది. విశ్లేషణ.. మనకు బాగా తెలిసిన వ్యక్తి జీవితంలోని ఆసక్తికర అంశాలను కూలంకుశంగా తెలుసుకోవాలనే ఆసక్తి సహజం. ‘ఒక్క మనిషి.. పలు కోణాలు’ అంటూ ట్యాగ్ లైన్‌తోనే సంజు జీవితంలోని దశలను దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ వివరించే యత్నం చేశాడు. అయితే వివాదాల నటుడు సంజయ్ దత్ లైఫ్‌ను తెరపై హిరాణీ డీల్ చేసిన విధానం అద్భుతం. వివాదాలను కూడా ఎమోషనల్‌గా మలిచిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. తన జీవితంలో ఎత్తుపల్లాలను పూసగూచ్చినట్లు వివరిస్తూ సంజు కథ ముందుకు సాగుతుంది. తల్లి మరణం, హీరోగా ఎదిగే క్రమంలో డ్రగ్స్ అలవాటుతో సంజు సతమతమయ్యే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆ వ్యసనం నుంచి బయటపడేందుకు చేసే స్ట్రగుల్, విమర్శలు వెల్లువెత్తినా తండ్రి(పరేష్ రావెల్) కొడుక్కి అండగా నిలవటం, ముఖ్యంగా వాళ్లిద్దరి మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్లు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అయితే ఫస్టాఫ్‌ను గ్రిప్పింగ్‌గా నడిపిన దర్శకుడు.. సెకండాఫ్‌ను మొత్తం జైలు జీవితం, కేసు, కోర్టు ప్రధానాంశాలుగా నడిపించాడు. తాను టెర్రరిస్ట్‌ను కాదంటూ సంజు పడే మానసిక సంఘర్షణ, భావోద్వేగపూరిత సన్నివేశాలతోనే ద్వితీయార్థాన్ని కానిచ్చేశాడు. అయితే ఈ క్రమంలో సంజు కెరీర్‌ను చూపించినా.. వ్యక్తిగత విషయాల జోలికి పోలేదు. హీరోయిన్లతో రిలేషన్షిప్స్, వైవాహిక జీవితంలోని లోతైన అంశాలను(మొదటి భార్య రిచా శర్మ, కూతురు త్రిశల గురించి) చూపించకుండా సంజు కథ సాగటం గమనార్హం. ఈ విషయంలో ప్రేక్షకులు కొంత అసంతృప్తికి గురికావొచ్చు. నటీనటుల విషయానికొస్తే.. సంజయ్ దత్ పాత్రలోకి రణ్‌బీర్ కపూర్ జీవించేశాడు. సంజు అంటే రణబీర్ అనేలా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కొన్ని సన్నివేశాల్లో రణ్‌బీర్ తనను తాను అద్భుతంగా ఆవిష్కరించుకున్నాడు. డ్రగ్స్ బాధితుడిగా చేసే సన్నివేశాలు అయితేనేం, వీధుల్లో అడుక్కునే సీన్ అయితేనేం, పోలీస్ విచారణలో, ఆస్పత్రిలో స్నేహితుడితో... ఒక్కటి కాదు చెప్పుకుంటూ పోతే బోలెడు సీన్లు. ఎమోషనల్ సీన్లలోనే కాదు.. కామెడీతో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ను కూడా పండించాడు. తండ్రి సునీల్ దత్ పాత్రలో పరేష్ రావల్‌ను తప్ప వేరే ఎవరినీ ఊహించుకోలేం అనిపించింది. సాధారణంగా ఎంటర్టైన్మెంట్ పాత్రలకు పేరుగాంచిన ఈ సీనియర్ నటుడు.. సీరియస్ నటనతో సంజుకు బలంగా నిలిచాడు. ఇక సంజు బెస్ట్ ఫ్రెండ్ కమలేష్(విక్కీ కౌశల్) పాత్ర సినిమాకు మరో ఆకర్షణ. కష్టాల్లో ఉన్న స్నేహితుడికి అండగా ఉండటం, సంజు-కమలేష్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు మంచి అనుభూతిని కలిగిస్తాయి. నర్గీస్ దత్ పాత్రలో సీనియర్ నటి మనీషా కోయిరాలాకు పెద్దగా సీన్లు లేవు. అయినా ఉన్నంతలో ఆమె పాత్ర అలరిస్తుంది. భార్య మాన్యతా పాత్రలో దియా మీర్జా మెప్పించారు. సోనమ్ కపూర్, అనుష్క శర్మ, మిగతా పాత్రలు ఓకే. పలువురు సెలబ్రిటీలు, చివర్లో కాసేపు స్వయంగా సంజయ్ దత్ కనిపించటం ఆకట్టుకుంది. ఏఆర్ రెహమాన్, రోహన్ రోహన్-విక్రమ్ మాంట్రెసె సంగీతం సినిమాకు తగ్గ మూడ్‌ను అందించింది. కర్ హర్ మైదాన్ ఫతే సాంగ్, రుబీ రుబీ పాటలు అలరిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తోపాటు విజువల్‌గా కూడా సంజు మెప్పిస్తుంది. రాజ్‌కుమార్ హిరాణీ అద్భుతమైన స్టోరీ టెల్లర్. అందులో ఏ మాత్రం సందేహం లేదు. దత్ ఫ్యామిలీతో ఉన్న స్నేహాన్ని పక్కనపెట్టి మరీ కథానుగుణంగా కొన్ని సన్నివేశాలను స్వేచ్ఛగా తెరకెక్కించారు. చిత్రం నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఓవరాల్‌గా హిరాణీ సినిమాల్లో లభించే హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమర్ ఎలిమెంట్స్ ‘సంజు’లో పుష్కలంగా లభిస్తాయి. ఫ్లస్ పాయింట్లు కథా-కథనం రణ్‌బీర్ కపూర్ మిగతా పాత్రలు సంగీతం మైనస్ పాయింట్లు కొన్ని ఆసక్తికరమైన అంశాలను చూపించకపోవటం అక్కడక్కడ సాగదీత సన్నివేశాలు - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
సల్మాన్‌కు సాలిడ్ కౌంటర్
విడుదలకు ముందే సీనియర్ హీరో సంజయ్ దత్ సంజుపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అచ్చం సంజును దింపేశాడంటూ రణ్‌బీర్ కపూర్‌పై ఇప్పటికే ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే సంజుపై స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చేసిన కామెంట్లు మాత్రం ఆసక్తికరంగా మారాయి. క్లైమాక్స్ సన్నివేశాల్లో సంజయ్ దత్ స్వయంగా నటిస్తేనే బాగుండేదన్న సల్లూ భాయ్ అభిప్రాయ పడ్డాడు. దీంతో రకరకాల కథనాలు బాలీవుడ్లో చక్కర్లు కొట్టగా.. చివరకు ఈ చిత్ర హీరో రణ్‌బీర్ ఎట్టకేలకు స్పందించారు. ‘ఎవరి బయోపిక్‌లో వాళ్లు నటించటం అనేది జరిగే పని కాదు. అది ఆ పాత్ర ఔనత్యాన్ని నాశనం చేస్తుంది. ప్రేక్షకులు చిత్రంలో నన్నే సంజుబాబాగా ఊహించుకుని చూస్తుంటారు. అలాంటప్పుడు ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయటం నా బాధ్యత. వయసురీత్యా సర్దుబాటు చేయాలంటూ అసలు పాత్రనే రంగంలోకి దించితే ఆ ఫలితం ఖచ్ఛితంగా తేడా కొడుతుంది. ఇంతదాకా ఏ దర్శకుడు కూడా అలాంటి ప్రయత్నం చేసి ఉండడనే నేను అనుకుంటున్నా. అసలు ఆ ఆలోచన చేసిన వాళ్లు.. అది కరెక్ట్కాదన్నది గుర్తిస్తే మంచిది’ అని ఆదివారం ఓ ఈవెంట్లో పాల్గొన్న రణ్‌బీర్ తెలిపాడు. కాగా, కత్రినా కైప్ విషయంలో ఈ ఇద్దరు హీరోలకు అస్సలు పడదనే.. బాలీవుడ్లో ఇప్పటికీ టాక్ నడుస్తూనే ఉంటుంది. సంజయ్ దత్ బెస్ట్ ఫ్రెండ్ కావటంతో ఆయన బయోపిక్‌పై సల్మాన్ మాములుగా స్పందించాడే తప్ప.. ఎవరినీ బాధపెట్టడానికి కాదని భాయ్ సన్నిహితుల చెబుతున్నారు. ఆ సంగతి పక్కనబెడితే రాజ్‌కుమార్ హిరానీ డైరెక్షన్లో తెరకెక్కిన సంజు ఈ నెల 29న విడుదల కానుంది. -
హీరో ‘డ్రగ్స్’ కష్టాలు
బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ బయోపిక్ సంజు రిలీజ్‌కు ముందే హాట్ టాపిక్‌గా మారింది. అచ్చం సంజూ బాబాలా తెరపై కనిపించేందుకు రణ్‌బీర్ కపూర్ పడ్డ కష్టం.. పైగా సంజయ్ దత్ లైఫ్‌లోని ప్రతీ కోణాన్ని విప్పి చూప్పానని దర్శకుడు చేసిన ప్రకటనతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లు ఆ అంచనాలను పెంచేయగా.. తాజాగా చిత్రంలోని ఓ సాంగ్ ప్రమోషన్ బిట్‌ను వదిలారు. ‘కర్ హర్ మైదాన్ ఫతే...’ అంటూ సాగే పాట.. శేఖర్ అస్థిత్వ లిరిక్స్, విక్రమ్ మాంట్రోస్ సంగీతాన్ని అందించగా.. సుఖ్విందర్ సింగ్-శ్రేయా ఘోషల్‌లు పాటను ఆలపించారు. సంజయ్ దత్ జీవితంలోని డ్రగ్స్ కోణాన్ని చూపిస్తే సాగే పాట ఇది. వాటి నుంచి తేరుకోడానికి పునరావాస కేంద్రానికి పంపించటం, అక్కడి నుంచి తప్పించుకుని తిరిగి ఇంటికి చేరటం, దారిలో అడ్డుకుంటూ కష్టాలు పడటం, డ్రగ్స్ నుంచి బయటపడేందుకు చేసే యత్నాలు, తల్లిదండ్రుల ఆప్యాయత.. మొత్తం ఎమోషనల్ కంటెంట్‌తో సాంగ్ సాగింది. ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ దర్వకత్వం వహించిన ఈ చిత్రంలో సంజయ్ దత్ తండ్రి సునీల్‌దత్ పాత్రలో పరేష్ రావెల్, తల్లి నర్గీస్ దత్ పాత్రలో మనీషా కోయిరాల నటించారు. సోనమ్ కపూర్, దియా మీర్జాలు ఇతరత్రా పాత్రల్లో నటిస్తుండగా, కీలక పాత్రలో అనుష్క శర్మ కనిపించనుంది. జూన్ 29న సంజు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
బండబూతులే ఆయన కౌంటర్లు
సాక్షి, ముంబై: బాలీవుడ్ వెటరన్ నటుడు రిషి కపూర్ వ్యవహార శైలి ఒక్కోసారి తీవ్ర విమర్శలకు దారితీస్తుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ దిగ్గజ నటుడు.. విమర్శకులకు ఒక్కోసారి ఘాటైన బదులు ఇస్తుంటారు. తాజాగా సంజయ్ దత్ బయోపిక్ సంజు ట్రైలర్ విడుదలై యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. అయితే ఓ వ్యక్తి ఈ చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీని విమర్శిస్తూ ఓ ట్వీట్ చేయగా, దానికి రిషి కపూర్ బండ బూతుతో బదులిచ్చారు. ‘సంజు ట్రైలర్ చూసి నిర్ఘాంతపోయా. సంజయ్ దత్ ఇమేజ్ను మంచిగా చూపేందుకే దర్శకుడు ప్రయత్నించాడు. అతనో క్రిమినల్. క్రిమినల్‌ను క్రిమినల్లాగేనే చూపించాలి. పైగా బాంబు పేలుళ్లలో అతని హస్తం ఉందన్న విషయం లోకానికి తెలుసు. అలాంటప్పుడు దర్శకుడు మూర్ఖంగా ఎలా చేయగలిగాడు’ అంటూ దర్శకుడిని ఉద్దేశిస్తూ ఓ వ్యక్తి ట్వీట్లు చేశాడు. ఇది రిషి కపూర్‌కు మంట పుట్టించింది. ‘సినిమా గురించి నీకేం తెలుసు *****. మేం ప్రేక్షకులకు వినోదం అందించేందుకు ఉన్నామే తప్ప.. ఎవరి ఇమేజ్‌నో రిపేర్ చేయటానికి కాదు. నీలాంటోళ్లు అసలు సినిమాలు చూసేందుకు కూడా పనికి రారు’ అంటూ రిషి ఘాటు రీ ట్వీట్ చేశారు. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న సంజు జూన్ చివర్లో విడుదల కానుంది. -
18 నెలల జైల్లోనే.. బెయిల్ కూడా దొరకలేదు!
న్యూఢిల్లీ : ‘‘ సంజూ మొదటిసారి 1993లో అరెస్ట్ అయ్యాడు. 18 నెలల పాటు జైలులో ఉన్నాడు. కనీసం బెయిల్ కూడా దొరకలేదు. ఆ సమయంలో సంజూ పరిస్థితికి అద్దం పట్టే పోస్టర్ ఇది ’’ అంటూ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ ‘సంజూ’ సినిమా లేటెస్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. హీరో రణ్‌బీర్ చేతులకు బేడీలతో ఉన్న ఫొటోను ఆయన ట్వీట్ చేశారు. ప్రముఖ బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సంజు’. ఈ సినిమాలో సంజయ్‌దత్ పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్‌ను ఇప్పటికే విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సంజు పాత్రలో రణ్‌బీర్ చేతులకు బేడీలు వేసుకున్న, 2013లో ఎరవాడ జైలులో ఉన్నప్పటి పోస్టర్లను ఆయన విడుదల చేశారు. ఇప్పటికే సినిమా పూర్తి కావస్తుండటంతో ప్రమోషన్లపై దృష్టి సారించింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా సంజయ్ దత్ జీవితంలో చోటుచేసుకున్న కీలక సంఘటనలకు సంబంధించిన సినిమా దృశ్యాల పోస్టర్లను ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది. Sanju was first arrested in 1993. In prison for 18 months. Could not get bail. A recreation of that time. #RanbirKapoor #RajkumarHiraniFilms @VVCFilms @foxstarhindi pic.twitter.com/JOL2W3pQaO — Rajkumar Hirani (@RajkumarHirani) May 12, 2018 -
నా భర్త తప్పేమీ లేదు: నటి
ముంబయి: 1990 దశకంలో దర్శకుల హీరోయిన్గా రాణించిన నటి మనీషా కోయిరాలా. ఆపై ప్రేమ వివాహంలో కలతలు, క్యాన్సర్ లాంటి మహమ్మారి బారిన పడి ఎన్నో కష్టాలను తట్టుకుని నిలబడ్డారు మనీషా. ప్రస్తుతం సంజయ్ దత్ బయోపిక్‌లో ఆయన తల్లి నర్గీస్ దత్‌గా కీలక పాత్రలో నటిస్తున్న ఈ బ్యూటీ వివాహం తర్వాత 'డియర్ మాయా'తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నేపాలీ భామ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 'మా వైవాహిక జీవితం నా కారణంగానే విఫలమైంది. వ్యాపారవేత్త సమ్రాట్ దహల్‌ను ఎంతగానో ప్రేమించాను. 2010లో నేపాలీ సంప్రదాయంలోనే ప్రేమ పెళ్లి చేసుకున్నాను. ఫేస్బుక్ పరిచయంతో మా ప్రేమ మొదలైంది. పెళ్లయిన రెండేళ్లకే అంటే 2012లోనే మా బంధం తెగిపోయింది. ఇందుకు పూర్తి భాద్యత నాదే. నా భర్త సమ్రాట్ చాలా మంచివాడు. ఇందులో ఆయన తప్పేం లేదు. అందరు అమ్మాయిల్లాగే ఎన్నో కలలుకన్నాను. కానీ కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. బంధం గట్టిపడదని భావిస్తే విడిపోవడం ఇద్దరికీ మంచిదని నా అభిప్రాయం. విడాకుల ఆలోచన నాదే. ఇంకా చెప్పాలంటే పెళ్లి విషయంలో పెద్ద పొరపాటు చేశాననిపిస్తోంది. 2012లో విడాకులు తీసుకున్న కొన్ని రోజులకే క్యాన్సర్ బారిన పడ్డాను. మరుసటి ఏడాది విజయవంతంగా క్యాన్సర్‌ను జయించానని' మనీషా వివరించారు. మరోవైపు.. తన భర్త శత్రువుగా మారిపోయాడని 2011లో ఫేస్బుక్లో స్వయంగా పోస్ట్ చేసిన మనీషా.. ఇప్పుడు ఎందుకిలా స్వరం మార్చి తప్పును ఎందుకు తనపై వేసుకుంటుందని భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
సంజయ్‌దత్ తల్లిగా మనీషా!!
1991లో వచ్చిన యాల్గార్, 1997లో వచ్చిన సనమ్, 1999లో వచ్చిన కర్టూస్.. ఈ సినిమాలు చూస్తే సంజయ్ దత్, మనీషా కొయిరాలా ఎంత హిట్ పెయిరో అర్థం అవుతుంది. వాళ్లిద్దరూ జంటగా చేసిన ఈ సినిమాలు అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ ఇప్పుడు అదే మనీషా.. అదే సంజయ్‌దత్‌కు తల్లిపాత్రలో నటించబోతోంది!! అవును ఇప్పుడు మీరెంత షాకయ్యారో, ఆ విషయం వినగానే మనీషా కొయిరాలా కూడా అంతే షాకైంది. సినిమాల్లో నటీనటులను బుక్ చేయడానికి ఏజెంటుగా వ్యవహరించే ముఖేష్ ఛాబ్రా మనీషాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పగానే, ''ఏంటి నేను సంజూబాబాకు అమ్మనా'' అని గట్టిగా అరిచింది. తామిద్దరం జంటగా పలు సినిమాలు చేశామని, సంజయ్‌దత్‌తో కలిసి షూటింగ్ అంటే తాను సెట్లలో టామ్ బోయ్‌లా ఉండేదాన్నని, అలాంటిది ఇప్పుడు తల్లి పాత్రలు, అది కూడా సంజయ్‌దత్‌కు తల్లిగా చేయడం ఏంటని మండిపడింది. ఇండస్ట్రీ ఎలా పనిచేస్తుందో తనకు తెలుసని కూడా చెప్పింది. అయితే.. ఆ తర్వాత మళ్లీ ఆమె తన తల్లితో మాట్లాడిన తర్వాత మనసు మార్చుకుంది. నర్గీస్ దత్ పాత్ర అనగానే తన తల్లి ఎగిరి గంతేసినంత పని చేసిందని మనీషా చెప్పింది. జీవితంలో మళ్లీ మళ్లీ నర్గీస్ పాత్ర పోషించే అవకాశం రాదని తన తల్లి చెప్పారని, అప్పట్లో ఆమె తన ట్రేడ్‌మార్క్ తెల్ల చీరలతో సృష్టించిన సెన్సేషన్ గురించి వివరించారని మనీషా తెలిపింది. దాంతో తాను కూడా అంత లెజెండరీ హీరోయిన్ పాత్ర అనేసరికి కాదనలేక సరేనన్నానని చివరకు చెప్పింది. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో వస్తున్న సంజయ్‌దత్ బయోపిక్‌లో ఇంకా రణబీర్ కపూర్, సోనమ్ కపూర్, పరేష్ రావెల్, విక్కీ కౌశల్, కరిష్మా తన్నా తదితరులు నటిస్తున్నారు. -
ఆయన అడిగితే ఆమిర్ కాదంటారా!
వయసుకి తగ్గ పాత్రలు చేయడం పెద్ద కష్టమేం కాదు. కానీ, తక్కువ వయసున్న పాత్రలూ వయసుకి మించిన పాత్రలూ చేయడం అంటే కష్టమే. ఆర్టిస్ట్‌లో ఎంతో ప్రతిభ ఉంటే తప్ప చేయలేరు. ఆమిర్ ఖాన్ ఎంతటి టాలెంటెడ్ ఆర్టిస్టో చెప్పడానికి ‘లగాన్’, ‘3 ఇడియట్స్’, ‘పీకే’ వంటి చిత్రాలను నిదర్శనంగా చెప్పొచ్చు. ప్రస్తుతం చేస్తున్న ‘దంగల్’లో యువ రెజ్లర్‌గా, మధ్య వయస్కుడిగా, వృద్ధుడిగా... ఇలా మూడు దశల్లో ఆమిర్ కనిపించనున్నారు. ఈ సినిమా కోసం బరువు పెరిగారు.. తగ్గారు. ముఖ్యంగా వృద్ధ పాత్ర కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. ఈ ఒక్క సినిమా కోసమే అయితే షూటింగ్ పూర్తయితే కష్టాలు గాయబ్ అవుతాయనుకోవచ్చు. కానీ, తదుపరి చిత్రంలో కూడా వృద్ధ పాత్రలో కనిపించనున్నారట. సంజయ్ దత్ జీవితం ఆధారంగా రాజ్‌కుమార్ హిరాని ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇందులో సంజయ్గా రణబీర్ కపూర్ నటించనున్నారు. సంజయ్ తండ్రి సునీల్‌దత్ పాత్రకు ఆమిర్ ఖాన్ని అడిగారట. ‘3 ఇడియట్స్’, ‘పీకే’ వంటి అద్భుత చిత్రాలు ఇచ్చి, నటుడిగా తన ప్రతిభను మరింతగా నిరూపించుకునేలా చేసిన రాజ్‌కుమార్ హిరాని అంటే ఆమిర్‌కి చాలా అభిమానం. అందుకే ఆయన సునిల్ దత్ పాత్రకు అడగ్గానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.