బండబూతులే ఆయన కౌంటర్లు | Rishi Kapoor Abuses Twitter User Over Sanju Trailer | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 3 2018 12:20 PM | Last Updated on Sun, Jun 3 2018 12:20 PM

Rishi Kapoor Abuses Twitter User Over Sanju Trailer - Sakshi

నటుడు రిషి కపూర్‌

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ వెటరన్‌ నటుడు రిషి కపూర్‌ వ్యవహార శైలి ఒక్కోసారి తీవ్ర విమర్శలకు దారితీస్తుంటుంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ దిగ్గజ నటుడు.. విమర్శకులకు ఒక్కోసారి ఘాటైన బదులు ఇస్తుంటారు. తాజాగా సంజయ్‌ దత్‌ బయోపిక్‌ సంజు ట్రైలర్‌ విడుదలై యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. అయితే ఓ వ్యక్తి ఈ చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీని విమర్శిస్తూ ఓ ట్వీట్‌ చేయగా, దానికి రిషి కపూర్‌ బండ బూతుతో బదులిచ్చారు. 

‘సంజు ట్రైలర్‌ చూసి నిర్ఘాంతపోయా. సంజయ్‌ దత్‌ ఇమేజ్‌ను మంచిగా చూపేందుకే దర్శకుడు ప్రయత్నించాడు. అతనో క్రిమినల్‌. క్రిమినల్‌ను క్రిమినల్‌లాగేనే చూపించాలి. పైగా బాంబు పేలుళ్లలో అతని హస్తం ఉందన్న విషయం లోకానికి తెలుసు. అలాంటప్పుడు దర్శకుడు మూర్ఖంగా ఎలా చేయగలిగాడు’ అంటూ దర్శకుడిని ఉద్దేశిస్తూ ఓ వ్యక్తి ట్వీట్లు చేశాడు. ఇది రిషి కపూర్‌కు మంట పుట్టించింది. 

‘సినిమా గురించి నీకేం తెలుసు *****. మేం ప్రేక్షకులకు వినోదం అందించేందుకు ఉన్నామే తప్ప.. ఎవరి ఇమేజ్‌నో రిపేర్‌ చేయటానికి కాదు. నీలాంటోళ్లు అసలు సినిమాలు చూసేందుకు కూడా పనికి రారు’ అంటూ రిషి ఘాటు రీ ట్వీట్‌ చేశారు. రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్న సంజు జూన్‌ చివర్లో విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement