సల్మాన్‌కు సాలిడ్‌ కౌంటర్‌ | Ranbir kapoor React on Salman Comments on Sanju | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 18 2018 3:24 PM | Last Updated on Mon, Jun 18 2018 3:24 PM

Ranbir kapoor React on Salman Comments on Sanju - Sakshi

విడుదలకు ముందే సీనియర్‌ హీరో సంజయ్‌ దత్‌ సంజుపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అచ్చం సంజును దింపేశాడంటూ రణ్‌బీర్‌ కపూర్‌పై ఇప్పటికే ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే సంజుపై స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ చేసిన కామెంట్లు మాత్రం ఆసక్తికరంగా మారాయి. క్లైమాక్స్‌ సన్నివేశాల్లో సంజయ్‌ దత్‌ స్వయంగా నటిస్తేనే బాగుండేదన్న సల్లూ భాయ్‌ అభిప్రాయ పడ్డాడు. దీంతో రకరకాల కథనాలు బాలీవుడ్‌లో చక్కర్లు కొట్టగా.. చివరకు ఈ చిత్ర హీరో రణ్‌బీర్‌ ఎట్టకేలకు స్పందించారు. 

‘ఎవరి బయోపిక్‌లో వాళ్లు నటించటం అనేది జరిగే పని కాదు. అది ఆ పాత్ర ఔనత్యాన్ని నాశనం చేస్తుంది. ప్రేక్షకులు చిత్రంలో నన్నే సంజుబాబాగా ఊహించుకుని చూస్తుంటారు. అలాంటప్పుడు ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయటం నా బాధ్యత. వయసురీత్యా సర్దుబాటు చేయాలంటూ అసలు పాత్రనే రంగంలోకి దించితే ఆ ఫలితం ఖచ్ఛితంగా తేడా కొడుతుంది. ఇంతదాకా ఏ దర్శకుడు కూడా అలాంటి ప్రయత్నం చేసి ఉండడనే నేను అనుకుంటున్నా. అసలు ఆ ఆలోచన  చేసిన వాళ్లు.. అది కరెక్ట్‌కాదన్నది గుర్తిస్తే మంచిది’ అని  ఆదివారం ఓ ఈవెంట్‌లో పాల్గొన్న రణ్‌బీర్‌ తెలిపాడు.

కాగా, కత్రినా కైప్‌ విషయంలో ఈ ఇద్దరు హీరోలకు అస్సలు పడదనే.. బాలీవుడ్‌లో ఇప్పటికీ టాక్‌ నడుస్తూనే ఉంటుంది. సంజయ్‌ దత్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ కావటంతో ఆయన బయోపిక్‌పై సల్మాన్‌ మాములుగా స్పందించాడే తప్ప.. ఎవరినీ బాధపెట్టడానికి కాదని భాయ్‌ సన్నిహితుల చెబుతున్నారు. ఆ సంగతి పక్కనబెడితే రాజ్‌కుమార్‌ హిరానీ డైరెక్షన్‌లో తెరకెక్కిన సంజు ఈ నెల 29న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement