
రిషి కపూర్ ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఫొటో
బాలీవుడ్ సీనియర్ నటుడు, హీరో రణ్‌బీర్ కపూర్ తండ్రి రిషీ కపూర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా 1993 నాటి ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేసిన రిషి కపూర్... ‘ థ్యాంక్యూ! ఈ నలుగురు అప్పుడెప్పటి నుంచో మూవీ(సంజు)ని ప్రమోట్ చేస్తూ ఉన్నారంటూ’ కామెంట్ చేశారు.
అసలు విషయమేమిటంటే... 1993 ముంబై పేలుళ్ల సమయంలో అరెస్టైన సంజయ్ దత్‌కు సంఘీభావం తెలుపుతూ బాలీవుడ్ పరిశ్రమ అండగా నిలిచిన విషయం తెలిసిందే. ‘సంజు వీ ఆర్ విత్ యూ’ (సంజు మేము నీతో ఉన్నాం) అనే పోస్టర్‌తో సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్‌లు నిల్చుని ఉన్న పాత ఫొటోను రిషి కపూర్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అయితే ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న రణ్‌బీర్ సంజు సినిమాను ప్రమోట్ చేసేందుకు రిషి కపూర్ కష్టపడాల్సిన అవసరం లేదోమో’ అంటూ నెటిజన్లు చమత్కరిస్తున్నారు. సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సంజు సినిమా పాజిటివ్ టాక్‌తో భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. సంజు పాత్రకు ప్రాణం పోసిన రణ్‌బీర్ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కుతుండటంతో రిషి కపూర్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు.
Thank you! These people been promoting the film ever since! pic.twitter.com/Ot2iDM9Hk7
— Rishi Kapoor (@chintskap) June 29, 2018