సంజయ్‌దత్ తల్లిగా మనీషా!! | Manisha Koirala to cast as mother to sanjay dutt | Sakshi
Sakshi News home page

సంజయ్‌దత్ తల్లిగా మనీషా!!

Published Mon, May 15 2017 5:25 PM | Last Updated on Tue, Sep 5 2017 11:13 AM

సంజయ్‌దత్ తల్లిగా మనీషా!!

సంజయ్‌దత్ తల్లిగా మనీషా!!

1991లో వచ్చిన యాల్‌గార్, 1997లో వచ్చిన సనమ్, 1999లో వచ్చిన కర్టూస్.. ఈ సినిమాలు చూస్తే సంజయ్ దత్, మనీషా కొయిరాలా ఎంత హిట్ పెయిరో అర్థం అవుతుంది. వాళ్లిద్దరూ జంటగా చేసిన ఈ సినిమాలు అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ ఇప్పుడు అదే మనీషా.. అదే సంజయ్‌దత్‌కు తల్లిపాత్రలో నటించబోతోంది!! అవును ఇప్పుడు మీరెంత షాకయ్యారో, ఆ విషయం వినగానే మనీషా కొయిరాలా కూడా అంతే షాకైంది. సినిమాల్లో నటీనటులను బుక్ చేయడానికి ఏజెంటుగా వ్యవహరించే ముఖేష్ ఛాబ్రా మనీషాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పగానే, ''ఏంటి నేను సంజూబాబాకు అమ్మనా'' అని గట్టిగా అరిచింది. తామిద్దరం జంటగా పలు సినిమాలు చేశామని, సంజయ్‌దత్‌తో కలిసి షూటింగ్ అంటే తాను సెట్లలో టామ్ బోయ్‌లా ఉండేదాన్నని, అలాంటిది ఇప్పుడు తల్లి పాత్రలు, అది కూడా సంజయ్‌దత్‌కు తల్లిగా చేయడం ఏంటని మండిపడింది. ఇండస్ట్రీ ఎలా పనిచేస్తుందో తనకు తెలుసని కూడా చెప్పింది.

అయితే.. ఆ తర్వాత మళ్లీ ఆమె తన తల్లితో మాట్లాడిన తర్వాత మనసు మార్చుకుంది. నర్గీస్ దత్ పాత్ర అనగానే తన తల్లి ఎగిరి గంతేసినంత పని చేసిందని మనీషా చెప్పింది. జీవితంలో మళ్లీ మళ్లీ నర్గీస్ పాత్ర పోషించే అవకాశం రాదని తన తల్లి చెప్పారని, అప్పట్లో ఆమె తన ట్రేడ్‌మార్క్ తెల్ల చీరలతో సృష్టించిన సెన్సేషన్ గురించి వివరించారని మనీషా తెలిపింది. దాంతో తాను కూడా అంత లెజెండరీ హీరోయిన్ పాత్ర అనేసరికి కాదనలేక సరేనన్నానని చివరకు చెప్పింది. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో వస్తున్న సంజయ్‌దత్ బయోపిక్‌లో ఇంకా రణబీర్ కపూర్, సోనమ్ కపూర్, పరేష్ రావెల్, విక్కీ కౌశల్, కరిష్మా తన్నా తదితరులు నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement