ఆయన అడిగితే ఆమిర్ కాదంటారా! | Aamir Khan To Play Ranbir Kapoor's Father In Sanjay Dutt Biopic? | Sakshi
Sakshi News home page

ఆయన అడిగితే ఆమిర్ కాదంటారా!

Published Thu, Aug 25 2016 12:04 AM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

ఆయన అడిగితే ఆమిర్ కాదంటారా!

ఆయన అడిగితే ఆమిర్ కాదంటారా!

 వయసుకి తగ్గ పాత్రలు చేయడం పెద్ద కష్టమేం కాదు. కానీ, తక్కువ వయసున్న పాత్రలూ వయసుకి మించిన పాత్రలూ చేయడం అంటే కష్టమే. ఆర్టిస్ట్‌లో ఎంతో ప్రతిభ ఉంటే తప్ప చేయలేరు. ఆమిర్ ఖాన్ ఎంతటి టాలెంటెడ్ ఆర్టిస్టో చెప్పడానికి ‘లగాన్’, ‘3 ఇడియట్స్’, ‘పీకే’ వంటి చిత్రాలను నిదర్శనంగా చెప్పొచ్చు. ప్రస్తుతం చేస్తున్న ‘దంగల్’లో యువ రెజ్లర్‌గా, మధ్య వయస్కుడిగా, వృద్ధుడిగా... ఇలా మూడు దశల్లో ఆమిర్ కనిపించనున్నారు.
 
 ఈ సినిమా కోసం బరువు పెరిగారు.. తగ్గారు. ముఖ్యంగా వృద్ధ పాత్ర కోసం చాలా  జాగ్రత్తలు తీసుకున్నారట. ఈ ఒక్క సినిమా కోసమే అయితే షూటింగ్ పూర్తయితే కష్టాలు గాయబ్ అవుతాయనుకోవచ్చు. కానీ, తదుపరి చిత్రంలో కూడా వృద్ధ పాత్రలో కనిపించనున్నారట. సంజయ్ దత్ జీవితం ఆధారంగా రాజ్‌కుమార్ హిరాని ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇందులో సంజయ్‌గా రణబీర్ కపూర్ నటించనున్నారు.
 
  సంజయ్ తండ్రి సునీల్‌దత్ పాత్రకు ఆమిర్ ఖాన్‌ని అడిగారట. ‘3 ఇడియట్స్’, ‘పీకే’ వంటి అద్భుత చిత్రాలు ఇచ్చి, నటుడిగా తన ప్రతిభను మరింతగా నిరూపించుకునేలా చేసిన రాజ్‌కుమార్ హిరాని అంటే ఆమిర్‌కి చాలా అభిమానం. అందుకే ఆయన సునిల్ దత్ పాత్రకు అడగ్గానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement