షకీల షూటింగ్‌ షురూ | Shakeela biopic to begin in August | Sakshi
Sakshi News home page

షకీల షూటింగ్‌ షురూ

Published Mon, Jul 16 2018 1:25 AM | Last Updated on Mon, Jul 16 2018 1:25 AM

Shakeela biopic to begin in August - Sakshi

రీచా చద్దా

బాలీవుడ్‌ హీరో సంజయ్‌ దత్‌ బయోపిక్‌ ‘సంజు’ ఇటీవలే రిలీజైంది. సెన్సేషనల్‌ స్టార్‌ సన్నీ లియోన్‌ బయోపిక్‌ ‘కరణ్‌జిత్‌ కౌర్‌: ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ సన్నీ లియోన్‌’ను వెబ్‌సిరీస్‌గా రూపొందించారు. ఈ రోజు నుంచి టీవీలో ప్రసారం కానుంది. ఇప్పుడు మరో సెన్సేషనల్‌ స్టార్‌ షకీల బయోపిక్‌ కూడా షూటింగ్‌కు సిద్ధమైంది. షకీల జీవితం ఆధారంగా దర్శకుడు ఇంద్రజిత్‌ లంకేశ్‌ ఓ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఆగస్ట్‌ నుంచి స్టార్ట్‌ కానుందని సమాచారం. షకీల బయోపిక్‌లో టైటిల్‌ రోల్‌ను బాలీవుడ్‌ భామ రీచా చద్దా చేయనున్నారు. ఈ బయోపిక్‌లో షకీలా సినిమా జర్నీ స్టార్ట్‌ చేసినప్పటి నుంచి అడల్ట్‌ స్టార్‌గా ఎలా ఎదిగారనే విషయాలను ప్రస్తావించనున్నారట. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో రిలీజ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement