‘షకీలా’ తెలుగు ట్రైలర్‌ | Shakeela Telugu Film Trailer Out | Sakshi
Sakshi News home page

‘షకీలా’ తెలుగు ట్రైలర్‌ విడుదల

Dec 26 2020 2:28 PM | Updated on Dec 26 2020 2:34 PM

Shakeela Telugu Film Trailer Out - Sakshi

1990లో ఖాళీగా ఉన్న సినిమా థియేటర్లు హౌజ్‌ఫుల్‌ కావాలంటే డిస్ట్రిబ్యూటర్లకు ఒకేఒక పేరు వినిపించేది. ఆ పేరే షకీలా. అప్పట్లో ఆమె సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించాయి. కానీ రాను రాను ఆమె క్రేజీ తగ్గిపోయింది. ఆమె సినిమాలు కనుమరుగైపోయాయి. కొంతమంది ఆమె సక్సెస్‌ను చూడలేక తొక్కేశారని కామెంట్స్‌ కూడా వినిపించాయి. అయితే తాజాగా ఆమె జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘షకీలా’ సినిమాను తెరకెక్కించాడు ప్రముఖ దర్శకుడు ఇంద్రజీత్‌ లంఖేష్‌.

బాలీవుడ్‌ నటి రిచా చద్దా లీడ్‌ రోల్‌ పోషిస్తున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ని శనివారం విడుదల చేసింది చిత్రబృందం.  ఇందులో షకీలా  శృంగార నాయిక‌గా ఎలాంటి పాపులారిటీ సంపాదించుకుంది వంటి కీల‌క అంశాల‌తోపాటు ఆమె జీవితంలోని మ‌రిన్ని కోణాలను చూపించారు. తెర వెనుక షకీలా జీవితం ఎలా ఉందనే అంశాలను చూపించినట్లు సినిమా చూస్తే తెలుస్తోంది. ఇక నూతన సంవత్సరం కానుకగా.. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 1న తెలుగు,తమిళం,హిందీ భాషల్లో  విడుదల చేయనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement