సంజయ్ దత్ జీవితంలోని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సంజు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సంజయ్ దత్ జీవితంలోని చీకటి కోణాలను కూడా చూపెట్టనున్నామని చిత్ర బృందం ప్రకటించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. సంజయ్ పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ తల్లి, అలనాటి ప్రముఖ నటి నర్గీస్ పాత్రలో మనీషా కొయిరాల నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ ఇటీవల షేర్ చేసిన పోస్టర్‌లో మనీషాను చూసిన జనాలు అచ్చం నర్గీస్‌లానే ఉందంటూ కామెంట్లు చేశారు.
తాజాగా మనీషా పోస్ట్ చేసిన ఫొటోలు మాత్రం అంతకుమించి అనేలా ఉన్నాయి. 1970నాటి నర్గీస్‌ను గుర్తుకు తెచ్చేలా.. అదే హెయిర్ స్టైల్, అదే చీర కట్టుతో కూడిన తన ఫొటోను మనీషా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలోని రెండో సాంగ్ కర్ హర్ మైదాన్ ఫతే.. తనకు ఎంతో ఇష్టమైన సాంగ్ అంటూ చెప్పుకొచ్చారు మనీషా. సంజయ్ పాత్రలో నటించడానికి రణబీర్ ఎంత కష్టపడ్డాడో.. మనీషా కూడా నర్గీస్‌లా మెప్పించేందుకు అంతే శ్రమించారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో రణ్‌బీర్, మనీషాతోపాటు సోనమ్ కపూర్, పరేష్ రావల్, అనుష్క శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
అదే హెయిర్ స్టైల్.. అదే చీర కట్టు
Published Mon, Jun 11 2018 11:33 AM | Last Updated on Mon, Jun 11 2018 1:57 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment