సంజు సినిమాలో ఆ విషయాలు చూపలేదు! | Sanju Movie Important Details Are Missed Sanjay Dutt Life | Sakshi
Sakshi News home page

సంజు సినిమాలో ఆ విషయాలు చూపలేదు!

Published Sat, Jul 7 2018 4:19 PM | Last Updated on Fri, Aug 17 2018 5:11 PM

Sanju Movie Important Details Are Missed Sanjay Dutt Life - Sakshi

సంజు

ముంబై : బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌ దత్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సంజు’. రణ్‌బీర్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విడుదలై మంచి వసూళ్లతో ముందుకు దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే సంజయ్‌ దత్‌ జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలన్నింటినీ తెరపై చూపించినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నా.. చాలా ముఖ్యమైన విషయాలను విస్మరించారని విమర్శకులు అంటున్నారు. సంజయ్‌ జీవితంలో కీలక పాత్రలు పోషించిన వారిని తెరపై అసలు చూపలేదని వారి వాదన. వారిలో సంజయ్‌ దత్‌ ఆప్త మిత్రుడైన సల్మాన్‌ ఖాన్‌, ప్రియురాలు మాధురీ దీక్షిత్ వంటి వారిని చూపలేదని, సంజయ్‌ కథానాయకునిగా తెరకెక్కిన రాఖీ చిత్రంతో వెండితెరకు పరిచయమైన హీరోయిన్‌ టీనా మునిమ్‌తో సంజుకు ఉన్న అఫైర్‌ గురించి ప్రస్తావన లేదని వారు అంటున్నారు.

రిషీ కపూర్‌ రాసిన ‘ఖుల్లంఖుల్లా’ అనే పుస్తకంలో టీనా మునిమ్‌ ప్రస్తావన తెచ్చారాయన. సంజయ్‌ అతని మిత్రుడు గుల్సన్‌ గ్రోవర్‌.. టీనా మునిమ్‌తో తనకు అఫైర్‌ ఉందన్న అనుమానంతో తనను కొట్టడానికి ఇంటికి వచ్చారని, అయితే తనకు కాబోయే భార్య నీతూ సింగ్‌ వారికి నచ్చచెప్పటంతో గొడవ సద్దుమణిగిందని ఆ పుస్తకంలో రిషీ కపూర్‌ రాసుకున్నారు. సంజయ్‌ జీవితంలోని ఎన్నో విషయాలను నిర్భయంగా చూపించిన చిత్రయూనిట్‌.. ఇలాంటి విషయాలను దాచిపెట్టడం ఏమిటని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement