చెత్త సినిమాగా తేల్చేశారు | Saheb Biwi Aur Gangster 3 Disaster Talk | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 30 2018 4:49 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Saheb Biwi Aur Gangster 3 Disaster Talk - Sakshi

బాలీవుడ్‌లో గత శుక్రవారం రిలీజ్‌ అయిన చిత్రాల్లో ఒకటి సంజయ్‌ దత్‌ నటించిన సాహెబ్‌ బీవీ ఔర్‌ గ్యాంగ్‌స్టర్‌ -3. ఉన్నంతలో కాస్త పెద్ద చిత్రంగా భావించిన ఈ చిత్రం ఏ దశలోనూ బాక్సాఫీస్‌ వద్ద తన ప్రతాపం చూపించలేకపోయింది. టిగ్మాన్షూ ధూల్హియా డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో జిమ్మీ షెయిర్‌గిల్‌, మహి గిల్‌, సంజయ్‌ దత్‌, చిత్రాంగద సింగ్‌ కీలకపాత్రలు పోషించారు. లీడ్‌ పాత్రల ఫెర్‌ఫార్మెన్స్‌ మాట పక్కన పెడితే కథలో పెద్దగా పసలేకపోవటంతో పూర్‌ రివ్యూలు దక్కాయి. క్రిటిక్స్‌ పరమ చెత్త మూవీగా తేల్చేశారు. 

రెండు రోజులకే డిజాస్టర్‌ టాక్‌ మూటగట్టుకున్న ఈ చిత్రం కలెక్షన్లలోనూ ఢీలా పడిపోయింది. కేవలం రూ. 5 కోట్ల కలెక్షన్లు మాత్రమే సాధించి.. మేకర్లకు భారీ నష్టాన్ని అందించింది. లాంగ్‌ రన్‌లో ఈ చిత్రం కలెక్షన్లు సింగిల్‌ డిజిట్‌ దాటడమే కష్టంగా కనిపిస్తోందని ట్రేడ్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సంజయ్‌ దత్‌ బయోపిక్‌ సంజు మాత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సల్మాన్‌ ఖాన్‌ టైగర్‌ జిందా హై కలెక్షన్లను దాటేసి వసూళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. మరికొన్ని రోజుల్లో పీకే రికార్డును కూడా క్రాస్‌ చేసే మూడో స్థానంలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్‌గా హయ్యెస్ట్‌ గ్రాసర్‌ దంగల్‌, బాహుబలి-2 లు  టాప్‌ 2 స్థానాల్లో ఉన్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement