
సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన మహానటి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. నాగ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకు భారీ వసూళ్లతో పాటు ఎన్నో అవార్డులు రివార్డులు దక్కాయి. తాజాగా ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. మెల్‌బోర్న్‌లో జరుగునున్న ఇండియన్ ఫిలిం ఫెస్టివల్‌లో మూడు ప్రధాన విభాగాల్లో మహానటి పోటి పడనుంది.
ఈ ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ నటి కేటగిరిలో కీర్తీ సురేష్ బాలీవుడ్ స్టార్స్ రాణీ ముఖర్జీ, దీపికా పదుకోన్, విద్యాబాలన్‌లతో.. సహాయ నటి కేటగిరిలో సమంత.. రిచా చడ్డా, ఫ్రిదా పింటో, మెహర్ విజ్‌లతో పోటి పడుతున్నారు. ఇక ఉత్తమ చిత్రం కేటగిరిలో తెలుగు సినిమా రంగస్థలంతో పాటు ప్యాడ్‌మ్యాన్, హిచ్‌కీ, సంజు, సీక్రెట్ సూపర్ స్టార్ లాంటి భారీ చిత్రాలతో మహానటి పోడిపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment