తమిళసినిమా: ఏ రంగంలోనైనా ఎవరైనా కోరుకునేది నంబర్‌ఒన్ స్థానాన్నే. ఇందులో మార్చు ఉండదు. సినిమా రంగం దీనికి అతీతం కాదు. అయితే ఈ రంగంలోని వారి గోల్ అదే అయినా పైకి మాత్రం నంబర్‌ఒన్ ఆశ లేదని, అది నిరంతరం కాదని, ప్రతి శుక్రవారం ఆ స్థానం మారుతుంతుందని అంటుంటారు. ముఖ్యంగా ఈ మాటలను కథానాయికల నుంచి వింటుంటాం. అయితే దేనికైనా విజయాలే కొలమానం కాబట్టి, దాన్ని బట్టే ఇక్కడ స్థానాలు నిర్ణయించబడతాయన్నది నిజం. కాగా ప్రస్తుతం కోలీవుడ్‌లో నంబర్‌వన్ కథానాయకి స్థానంలో నయనతార, టాలీవుడ్‌లో అనుష్క పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరు నటించిన చిత్రాలు సక్సెస్ అవుతున్నా, నటిస్తున్న చిత్రాల విడుదల్లో జాప్యం జరుగుతోంది. చేతిలో పలుచిత్రాలు ఉన్నా, అరమ్ చిత్రం తరువాత నయనతార నటించిన మరో చిత్రం తెరపైకి రాలేదు. అదే విధంగా నటి అనుష్క భాగమతి చిత్రం మరో చిత్రాన్ని అంగీకరించిన దాఖలాలు లేవు.
ఇంతకు ముందు చెప్పినట్లు విజయాలే కొలమానం కాబట్టి 2018లో నంబర్‌వన్ స్థానాన్ని సమంత ఆక్రమించుకున్నారనే ప్రచారం మొదలైంది. ఈ బ్యూటీ నటించిన తెలుగు చిత్రం రంగస్థలం, ద్విభాషా చిత్రం మహానటి, తమిళ చిత్రం ఇరుంబుతిరై చిత్రాలు అనూహ్య విజయాలను సాధించాయి. ఇలా ఒకే ఏడాది వరుసగా విజయాలను అందుకున్న నటి సమంతనే అని చెప్పాలి. అంతే కాదు ఇరుంబుతిరై తెలుగులో అభిమన్యుడు పేరుతో అనువాదంమై వసూళ్లను సాధిస్తోంది. ఈ విజయంలోనూ సమంత భాగం పంచుకున్నారు. తాజాగా సమంత తమిళంలో మరో 3 చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో విజయ్‌సేతుపతితో సూపర్ డీలక్స్, శివకార్తికేయన్‌కు జంటగా సీమరాజా, ద్విభాషా చిత్రం యూ టర్న్. ఈ మూడు చిత్రాలపైనా మంచి అంచనాలే నెలకొన్నాయి. అదేవిధంగా ఇవి కూడా ఈ ఏడాదే తెరపైకి రావడానికి రెడీ అవుతున్నాయి. వీటి రిజల్ట్ కూడా పాజిటివ్‌గా వస్తే కచ్చితంగా నంబర్‌వన్ స్థానం సమంతదే అవుతుంది. ఇరుంబుతిరై చిత్ర సక్సెస్ జోరులో ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు సూపర్ డీలక్స్ చిత్రానికి డబ్బింగ్ చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment