సాక్షి, సినిమా : ఆ చిత్రంలో తన పాత్ర ఏమిటన్నది ఇప్పుడే బయట పెట్టనని అంటున్నారు నటి సమంత. ప్రేమించిన వాడిని (నాగచైతన్య) మనువాడి సంతోషంగా ఉన్నానంటున్న ఈ మగువ నటిగానూ ఉన్నతిని చాటుకునే విధంగా పాత్రలను ఎంచుకుంటున్నారట. నిజం చెప్పాలంటే వివాహానంతరమే కథానాయకిగా బిజీ అయ్యారు. తెలుగు, తమిళ భాషల్లో కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రల్లో నటిస్తున్నారు. దీని గురించి సమంత తెలుపుతూ తాను తెలుగులో రామ్‌చరణ్‌కు జంటగా నటిస్తున్న రంగస్థలంలో తానింతవరకూ పోషించనటువంటి గ్రామీణ పాత్రలో నటించానని, అలా అనడం కంటే గ్రామీణ యువతిగా జీవించాననే చెప్పాలని అన్నారు. ఇక సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం మహానటిలో తాను పాత్రికేయురాలిగా నటిస్తున్నానని, మరి కొందరు జమున పాత్రలో నటిస్తున్నానని ప్రచారం చేస్తున్నారని, వాటిలో నిజం లేదని అన్నారు. అయితే అందులో తన పాత్ర ఏమిటన్న సస్పెన్స్‌ను మాత్రం ఇప్పుడే బ్రేక్ చేయనని అన్నారు.
ఇకపోతే కన్నడంలో మంచి విజయాన్ని సాధించిన యూటర్న్ చిత్ర రీమేక్‌లో నటిస్తున్నానని, అయితే దాని వర్జినల్‌గా నటించిన నటి కంటే విభిన్నంగా తాను నటిస్తున్నట్లు చెప్పారు. కన్నడ చిత్రం చూసిన వారికి కూడా తన చిత్రం కొత్త అనుభవాన్నిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే విధంగా ఇకపై కూడా వైవిధ్యం ఉన్న కథా పాత్రలనే ఎంపిక చేసుకుని నటిస్తానని సమంత అన్నారు. ఈమె తమిళంలో విశాల్‌కు జంటగా నటించిన ఇరుంబుతిరై చిత్రం కూడా విడుదలకు ముస్తాబుతోంది. అదే విధంగా శివకార్తికేయన్ సరసన నటిస్తున్న సీమరాజా చిత్రం శరవేగంగా నిర్మాణ కార్యక్రమాలను జరుపుకుంటోది.
Comments
Please login to add a commentAdd a comment