బాహుబలి-2 రికార్డు బద్ధలు | Sanju Beats Baahubali 2 Single Day Record | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 2 2018 12:11 PM | Last Updated on Mon, Jul 2 2018 4:21 PM

Sanju Beats Baahubali 2 Single Day Record - Sakshi

ఇండియన్‌ భాక్సాఫీస్‌ వద్ద బాహుబలి ది కంక్లూజన్‌ సృష్టించిన రికార్డులు ఇంకా కళ్ల ముందు మెదులుతున్నాయి. హిందీతోపాటు విడుదలైన అన్ని భాషల్లోనూ బెంచ్‌ మార్క్‌ రికార్డులను క్రియేట్‌ చేసింది. అప్పటి నుంచి విడుదలైన చిత్రాలు భారీస్థాయిలో స్క్రీన్లలో రిలీజ్‌ చేసినప్పటికీ ఆ ఫీట్‌ను అందుకోలేకపోయాయి. అయితే ఎట్టకేలకు రీసెంట్‌ రిలీజ్‌ సంజు బాహుబలి-2 నెలకొల్పిన ఓ రికార్డును మాత్రం అధిగమించింది. 

ఈ చిత్రం ఆదివారం(మూడో రోజు) రూ. 46.71 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది. అంతకు ముందు ఆ రికార్డు రూ.46.50 కోట్లతో బాహుబలి-2(హిందీ వర్షన్‌) పేరిట ఉంది. ఏదైతేనేం మొత్తానికి బాహుబలి-2కి చెందిన ఓ రికార్డును అధిగమించామని బాలీవుడ్‌ మీడియా కథనాలు ప్రచురించేస్తోంది. రాజ్‌కుమార్‌ హిరాణీ డైరెక్షన్‌లో రణ్‌బీర్‌ కపూర్‌ లీడ్‌ రోల్‌లో నటించిన సంజు కేవలం మూడు రోజుల్లోనే రూ. 120 కోట్లు వసూలు చేసి ఈ ఏడాది బాలీవుడ్‌ బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. తొలిరోజ దాదాపు రూ.35 కోట్లు వసూలు చేసి ఈ ఏడాది హయ్యెస్ట్‌ ఓపెనర్‌గా నిలవటంతోపాటు.. రణ్‌బీర్‌ కెరీర్‌ బెస్ట్‌ ఓపెనర్‌గా కూడా నిలిచింది.

సాహోరే.. హైబ్రిడ్‌ పిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement