‘సంజు’ సిన్మాకు సంజయ్‌ ఎంత తీసుకున్నారు? | Sanjay Dutt Remuneration For Sanju Movie | Sakshi
Sakshi News home page

Jul 8 2018 3:56 PM | Updated on Jul 8 2018 4:50 PM

Sanjay Dutt Remuneration For Sanju Movie - Sakshi

బయోపిక్‌లు వాస్తవానికి దూరంగా తెరకెక్కుతున్నాయన్న విమర్శలు వస్తోన్నా.. సినిమాలు మాత్రం విజయవంతమవుతున్నాయి. బాలీవుడ్‌లో అందరూ ఎదురుచూసిన సంజయ్‌ దత్‌ బయోపిక్‌ ‘సంజు’ సినిమా గత వారం విడుదలై  సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. సంజయ్‌దత్‌గా రణ్‌బీర్‌ కపూర్‌ నటనకు బాలీవుడ్‌ మొత్తం ఆశ్చర్యపోతోంది. 

రాజ్‌కుమార్‌ హిరాణీ గత సినిమాల మాదిరిగానే ‘సంజు’ సినిమా రికార్డులను బ్రేక్‌ చేస్తోంది. విడుదలైన వారంలోనే దాదాపు 200కోట్లు కలెక్ట్‌ చేసి ప్రస్తుతం 250కోట్లకు పరుగెడుతోంది. అయితే ఈ సినిమాకు గాను సంజయ్‌దత్‌కు ఎంత ముట్టజెప్పారన్న వార్తలు వైరల్‌గా మారాయి. సంజయ్‌దత్‌కు మొదటగా ఓ పదికోట్లు ఇచ్చారని, సినిమా లాభాల్లో షేర్‌ కూడా ఉందనీ.. మొత్తంగా సంజయ్‌ దత్‌కు దాదాపు 20కోట్ల వరకు ముట్టవచ్చని బీటౌన్‌ టాక్‌.  విదూ వినోద్‌ చోప్రా, రాజ్‌కుమార్‌ హిరాణీ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో సోనమ్‌కపూర్‌, మనీషా కొయిరాల, పరేష్‌ రావెల్‌, దియా మీర్జా, విక్కీ కౌశల్, అనుష్క శర్మ ముఖ్యపాత్రల్లో నటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement