కిస్.. పాపులర్!
రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్, కన్యా వెస్ట్స్ వెడ్డింగ్ పిక్చర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో కేక పుట్టిస్తున్నాయి. అన్నింటిలోకి వెడ్డింగ్ డేలో ఇద్దరి ఫస్ట్ కిస్ నెటిజన్లకు తెగ కిక్కు ఇచ్చింది. ఈ దెబ్బకు ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డు బద్దలైంది. మొత్తం 2.4 మిలియన్ లైక్స్‌తో సంచలనం రేపింది. ‘2014లో మోస్ట్ లైక్‌డ్ పోస్ట్’గా కొత్త రికార్డు రాసింది. ఈ ఏడాది మే 24న కిమ్ పెళ్లి జరిగింది. జస్టిన్ బీబర్, సెలెనా గోమేజ్‌ల ముద్దు 1.9 మిలియన్ పీపుల్‌కు నచ్చిందట. మాజీ డిస్నీ స్టార్ అరియానా గ్రాండే... మిలే సిరస్ బుగ్గపై ముద్దాడుతున్న చిత్రం (1.84 మిలియన్) మూడో స్థానం దక్కించుకుంది.