first kiss
-
18 ఏళ్లకే ఫస్ట్ కిస్, నాన్న ప్రోత్సాహంతోనే: పూజా భట్
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మహేష్ భట్ కూతురు పూజా భట్ 18 ఏళ్లకే తన ఫస్ట్ కిస్ అనుభవాన్ని చుశానని పేర్కొన్నారు. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కేరీర్ ప్రారంభంలోని సంగతులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె నటించిన ‘సడక్’ చిత్రంలోని ఓ ముద్దు సన్నివేశం గురించి వివరించారు. ఆ సీన్లో నటించేందుకు తను ఇబ్బంది పడుతుంటే తన తండ్రి(మహేష్ భట్) దగ్గరుండి ఆ సన్నివేశాన్ని చేయించారన్నారు. ‘సడక్ మూవీ చేస్తున్న సమయానికి నాకు 18 ఏళ్లు. ఈ సినిమాలో ముద్దు సన్నివేశంలో నటించాల్సి వచ్చినప్పుడు భయంతో వణికిపోయాను. నాన్న ముందు ఆ సీన్ చేయాలంటే చాలా ఇబ్బందిగా అనిపించింది. దీంతో నాన్న నన్ను పక్కకు తీసుకెళ్లి నువ్వు ముద్దును వల్గర్‌గా ఫీల్ అయ్యావంటే అందులో నీకు వల్గారిటియే కనిపిస్తుంది. అదే నువ్వు ముద్దు సన్నివేశాన్ని గౌరవించి.. ఎంత ఇష్టంతో నటిస్తే ఆ సన్నివేశం అంతబాగా పండుతుంది. కథలో భాగంగా ప్రతి సీన్లోని ఇంటెన్షన్ తెలుసుకోవాలని’ చెప్పారని పేర్కొన్నారు. అలా తన తండ్రి మహేష్ భట్ ప్రోత్సాహంతో ముద్దు సీన్లో నటించగలిగానని, అప్పుడు ఆయన చెప్పిన మాటలను ఇప్పటికి గుర్తుచేసుకుంటూ కెమెరా ముందు నిబద్ధతతో నటిస్తుంటానని పూజా తెలిపారు. కాగా పూజా భట్ 1991 చిత్రం సడక్తో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో సంజయ్ దత్‌కు ఆమె హీరోయిన్గా నటించారు. ఈ మూవీకి ఆమె తండ్రి మహేష్ భట్ దర్శకత్వం వహించారు. కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పూజా భట్ ఇటీవల 'బాంబే బేగమ్స్' అనే వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న నెట్ ఫ్లిక్స్‌లో ఈ వెబ్ సిరీస్ విడుదలైంది. చదవండి: ట్రెండింగ్: సడక్ 2కు డిస్‌లైకుల వర్షం -
18 ఏళ్లకే ఫస్ట్ కిస్.. డేటింగ్ మాత్రం..
పరిణీతి చోప్రా ముఖ్య పాత్రలో నటించిన తాజా హిందీ చిత్రం ‘ది గాళ్ ఆన్ ది ట్రైన్’. ఓటీటీలో ఫిబ్రవరి 26న ఈ సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ముఖ్య విషయాలను పంచుకుంది ఈ భామ. తనకి 18 ఏళ్లు ఉన్నప్పుడే ఓ అబ్బాయిని ముద్దు పెట్టుకున్నానంటూ తన ఫస్ట్ కిస్ గురించి ఓపెన్ అప్ అయ్యింది. జీవితంలో తొలి ముద్దు ఎవరికైనా ప్రత్యేకమే. దాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. తన లైఫ్‌లోనూ ఆ ఫస్ట్ కిస్ చాలా స్పెషల్ అని తెలిపింది. అయితే ఇప్పటివరకు తానెప్పుడూ డేట్‌కు వెళ్లలేదని,వాటిపై పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదని పేర్కొంది. డేట్ అంటే..'ఇంటికి వచ్చేశెయ్..కలిసి భోం చేద్దాం, ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తింటూ చిల్ అవుదాం' అని అంటానని పరిణితి తెలిపింది. తన ఫస్ట్ క్రష్ మాత్రం ఎప్పటికీ హీరో సైఫ్ అలీ ఖాన్ అని, ఆయనను అభిమానించడమే కాకుండా అతనిని ప్రేమించే దానిని వెల్లడించారు. కాగాఇంతకుముందు అధిక బరువు కారణంగా చాలా ట్రోలింగ్కి గురయ్యానని, అవకాశం వస్తే తన జీవితంలో ఆ అధ్యాయాన్ని చెరిపివేస్తానని పేర్కొంది. అధిక బరువుతో అనారోగ్యం కూడా వస్తుందని, అందుకే ఇప్పుడు ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పింది. కొన్ని చేదు అనుభవాలు తన జీవితంలోనూ ఉన్నాయని, వాటిని ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతూ పరిణితి ఎమోషనల్ అయ్యింది. కాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చెల్లెలిగా ఇండస్ర్టీలో అడుగుపెట్టినా..నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న పరిణితి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇటీవలే ఆమె నటించిన ‘ది గాళ్ ఆన్ ది ట్రైన్’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆమె నటించిన సందీప్ ఔర్ పింకీ ఫరార్, సైనా బయోపిక్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. చదవండి : (అందుకే సుశాంత్‌తో సినిమా చేయలేదు..) ('అజయ్ దేవ్‌గణ్, నీకు సిగ్గనిపించడం లేదా?') View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
కిస్.. పాపులర్!
రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్, కన్యా వెస్ట్స్ వెడ్డింగ్ పిక్చర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో కేక పుట్టిస్తున్నాయి. అన్నింటిలోకి వెడ్డింగ్ డేలో ఇద్దరి ఫస్ట్ కిస్ నెటిజన్లకు తెగ కిక్కు ఇచ్చింది. ఈ దెబ్బకు ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డు బద్దలైంది. మొత్తం 2.4 మిలియన్ లైక్స్‌తో సంచలనం రేపింది. ‘2014లో మోస్ట్ లైక్డ్ పోస్ట్’గా కొత్త రికార్డు రాసింది. ఈ ఏడాది మే 24న కిమ్ పెళ్లి జరిగింది. జస్టిన్ బీబర్, సెలెనా గోమేజ్ల ముద్దు 1.9 మిలియన్ పీపుల్‌కు నచ్చిందట. మాజీ డిస్నీ స్టార్ అరియానా గ్రాండే... మిలే సిరస్ బుగ్గపై ముద్దాడుతున్న చిత్రం (1.84 మిలియన్) మూడో స్థానం దక్కించుకుంది. -
ముద్దులు నేర్పే దిండు
లండన్: తొలిముద్దు.. ప్రేమికులు కలకాలం గుర్తిండిపోయేలా ఉండాలని కలలు కంటారు. అసలే కొత్త. ఆపై భయం. దీంతో ముద్దు ముచ్చట తీరకపోతే తీవ్ర నిరాశే. అయితే ఇకపై వాళ్లు భయపడక్కర్లేదు. ఎందుకంటే ముద్దుల్ని ముందే ప్రాక్టీసు చేసుకోవచ్చు. యువ‘కల’లను దష్టిలో పెట్టుకుని అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన డిజైనర్ ఎమిలీ కింగ్(26) ఒక ప్రత్యేక దిండుని రూపొందించింది. దీని మధ్యలో సీపీఆర్ (కార్డియోపల్మనరీ రిససైటేషన్) డమ్మీలు పెట్టి కుట్టిన కత్రిమ పెదవులు ఉంటాయి. ఇవి అచ్చం పెదవుల్లాగే ఉండి ముద్దులు పెట్టడంలో మంచి ప్రాక్టీస్నిస్తాయని ఎమిలీ ముద్దు ముద్దుగా చెప్పింది. దిండు ఆలోచన తన స్నేహితులు ముందు పెట్టినపుడు.. 25 ఏళ్ల పైబడిన వారు వ్యతిరేకించారని, కాలేజీ విద్యార్థులయితే ఆహా, ఓహో, అదుర్స్ అంటూ ప్రశంసించారని తెలిపింది. తన దిండు పని పూర్తయే వరకూ తాను కూడా ఎంతో ఉత్సుకతతో ఉన్నానంది ఎమిలీ. ఈ దిండు ఒంటరి జీవుల ముద్దుముచ్చటను కూడా తీరుస్తుందని తెలిపింది. -
తొలిముద్దును చెరిపేసుకుంటానన్న మోలీ కింగ్
తన తొలిముద్దు జ్ఞాపకాలను చెరిపేసుకుంటానని చెబుతోంది గాయని మోలీ కింగ్ (26). సాటర్ డేస్ బ్యాండ్‌లో గాయనిగా ప్రసిద్ధి చెందిన ఈ ముద్దుగుమ్మకు ఆ తొలిముద్దు ఏమాత్రం నచ్చలేదట. అది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తోందని ఇప్పుడు చెబుతోంది. ఇంతకీ ఆ తొలి ముద్దు అనుభవం ఎప్పుడు, ఎవరితో అయ్యిందో చెప్పట్లేదు గానీ అది మాత్రం నచ్చలేదని అంటోంది. ఈ విషయం బ్లిస్ పత్రికలో ప్రముఖంగా వచ్చింది. ''నా తొలి ముద్దు అనుభవం ఏమాత్రం బాగోలేదు. అందుకే.. దాన్ని చెరిపేసుకోవాలనుకుంటున్నాను. ఆ అబ్బాయి నా మీదకు దాడి చేసినట్లుగా దూకాడు. అందుకే అది నాకు నచ్చలేదు'' అని ఆమె చెప్పింది. ప్రస్తుతం మ్యూజిక్ ఆల్బంల నిర్మాత జోర్డాన్ ఓమ్లీతో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఈ ముద్దుగుమ్మ ఇంతకుముందు ప్రముఖ మోడల్ డేవిడ్ గాండీతో కలిసుండేది.