లండన్: తొలిముద్దు.. ప్రేమికులు కలకాలం గుర్తిండిపోయేలా ఉండాలని కలలు కంటారు. అసలే కొత్త. ఆపై భయం. దీంతో ముద్దు ముచ్చట తీరకపోతే తీవ్ర నిరాశే. అయితే ఇకపై వాళ్లు భయపడక్కర్లేదు. ఎందుకంటే ముద్దుల్ని ముందే ప్రాక్టీసు చేసుకోవచ్చు. యువ‘కల’లను దష్టిలో పెట్టుకుని అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన డిజైనర్ ఎమిలీ కింగ్(26) ఒక ప్రత్యేక దిండుని రూపొందించింది. దీని మధ్యలో సీపీఆర్ (కార్డియోపల్మనరీ రిససైటేషన్) డమ్మీలు పెట్టి కుట్టిన కత్రిమ పెదవులు ఉంటాయి. ఇవి అచ్చం పెదవుల్లాగే ఉండి ముద్దులు పెట్టడంలో మంచి ప్రాక్టీస్‌నిస్తాయని ఎమిలీ ముద్దు ముద్దుగా చెప్పింది.
దిండు ఆలోచన తన స్నేహితులు ముందు పెట్టినపుడు.. 25 ఏళ్ల పైబడిన వారు వ్యతిరేకించారని, కాలేజీ విద్యార్థులయితే ఆహా, ఓహో, అదుర్స్ అంటూ ప్రశంసించారని తెలిపింది. తన దిండు పని పూర్తయే వరకూ తాను కూడా ఎంతో ఉత్సుకతతో ఉన్నానంది ఎమిలీ. ఈ దిండు ఒంటరి జీవుల ముద్దుముచ్చటను కూడా తీరుస్తుందని తెలిపింది.