pillow
-
పిల్లోలు.. పరుపు ఎలా ఉండాలంటే...
రాత్రివేళ నిద్రలో మనం చాలాసార్లు అటు పక్కకూ, ఇటు పక్కకూ తిరగాల్సి వస్తుంది. అలా పక్కకు తిరిగి పడుకున్న సమయంలో తలకూ, పడకకూ మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ కారణంగా తలపై మరింత భారం పడి సుఖ నిద్ర సాధ్యం కాదు. అందుకే మంచి తలగడను ఉపయోగించడం ద్వారా ఆ గ్యాప్ లేకుండా చూసుకోవాలి. కొందరు తలగడ ఉన్నా దాని సపోర్ట్ సరిపోక మళ్లీ భుజాన్ని కూడా వాడుతుంటారు. ఇది కూడా సరికాదు. తలగడ ఎలా ఉండాలంటే... తలగడ మృదువుగా భుజాలు, తల పట్టేంత సైజులో ఉండాలి. కార్లలో ఉపయోగించే చిన్న తలగడలు పడక మీద నిద్రలో ఉపయోగించడం సరికాదు. తలగడను కేవలం తలకింద మాత్రమే అమరేలా కాకుండా... కొంత భాగం భుజాల కిందికీ వచ్చేలా అమర్చుకోవాలి. దీనివల్ల స్పాండిలోసిస్ కారణంగా వచ్చే మెడనొప్పి నివారితమవుతుంది. స్పాండిలోసిస్, మెడనొప్పి, భుజాల నొప్పి వంటి సమస్యలు ఉన్నవారు తమకు అనువైన తలగడను ఎంచుకొని, నిద్రకోసం దాన్నే వాడాలి. ఎవరి తలగడ వారికి వేరుగా ఉండాలి. తలగడ మీద ఉండే డస్ట్‌మైట్స్ తో కొందరికి అలర్జీలూ, ఆస్తమా కూడా రావచ్చు. అందుకే తలగడను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇందుకోసం ఉతికిన పిల్లోకవర్ తొడిగిన తలగడనే వాడాలి. పడక ఎలా ఉండాలంటే... వీపునొప్పితో బాధపడే చాలామంది పరుపు వాడకూడదని, గట్టి ఉపరితలం మీద పడుకోవాలన్న అపోహతో చెక్కబల్ల మీద పడుకుంటుంటారు. వాస్తవానికి అది మంచిది కాదు. మంచి పరుపు మీద పడుకోవడమే మంచిది. అది శరీరానికి గట్టిగా ఒత్తుకోకుండా ఉండేంత మృదువుగా ఉండాలి. అదేవిధంగా మనం అందులోకి కూరుకుపోయేటంత మెత్తగా ఉండకూడదు. గట్టి ఉపరితలం మీద పడుకుంటే ఒంట్లో చాలా భాగాలు నొక్కుకుపోయి, అలా నొక్కుకుపోయిన చోట్ల నొప్పి వచ్చే అవకాముంటుంది. అందుకే పరుపును ఎంపిక చేసే సమయంలో అది శరీరానికి ఒత్తుకోకుండా మృదువుగా ఉండటంతో పాటు మనం కూరుకుపోకుండా ఉండేలాంటి పరుపును తీసుకోవాలి. పరుపు వాడేటప్పుపడు ప్రతివారం దాన్ని తిరగవేయడం మంచిది. ఎందుకంటే ఒకేవైపు వాడుతుంటే శరీరం బరువు ఒకేచోట పడి అది తన ఎలాస్టిసిటీని కోల్పోయి, గుంటలా పడుతుంది. అందుకే మార్చి మార్చి వాడాలి. ఒక పరుపును మూడేళ్ల పాటు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఆ తర్వాత అవకాశముంటే మార్చడమే మంచిది.(చదవండి: డార్క్ చాక్లెట్ టైప్2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందట) -
నిద్దురలో బాగా గురక కొడ్తున్నారా! అయితే ఈ దిండు..
కొందరు నిద్రపోయేటప్పుడు గురక తీస్తుంటారు. గాఢనిద్రలో ఎవరు తీసే గురక వారికి తెలియదు గాని, వారితో పాటు ఒకే గదిలో పడుకునేవారికి నిద్రాభంగమవుతుంది. రకరకాల శారీరక సమస్యల వల్ల ఇలా గురక వస్తుంటుంది. గురకను అరికట్టడానికి ఇప్పటి వరకు ప్రత్యేకమైన ఔషధాలు, చికిత్సలు ఏవీ లేవు. అయితే, ఈ స్మార్ట్ తలదిండు గురకను ఇట్టే అరికడుతుందని చెబుతున్నారు.ఈ స్మార్ట్ దిండును కెనడియన్ కంపెనీ డెరుక్కి తయారు చేసింది. ఇది యాప్ ద్వారా పనిచేస్తుంది. నిద్ర తీరు తెన్నులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, తేడాలు ఉన్నట్లయితే యాప్ ద్వారా సమాచారం అందిస్తుంది. గురక మొదలయ్యే సూచన రాగానే, తల భంగిమను మార్చుకునేలా చేస్తుంది. స్లీప్ ఆప్నియా వంటి వ్యాధులను అరికట్టడానికి ఈ స్మార్ట్ దిండు బాగా ఉపయోగపడుతుంది. ఈ యాంటీ స్నోర్ పిల్లో గురక బాధను 89 శాతం వరకు నివారిస్తుందని తయారీదారులు చెబుతున్నారు. దీని ధర 699 డాలర్లు (రూ.58,212).ఇవి చదవండి: Children's Story: ఉత్తమ శిష్యుడు! 'మేము సర్వసంగ పరిత్యాగులం'.. -
ఈ దిండుతో గురకకు చెప్పండి గుడ్ బై.. ఇది చాలా స్మార్ట్ గురూ!
ఈ దిండు గురక నివారిణి. దీని మీద తలపెట్టుకుని ఆదమరచి నిద్రించినట్లయితే, గురక బెడద ఉండదు. నిద్రలో అటూ ఇటూ కదిలేటప్పుడు తల ఎటు తిరిగితే అటువైపు ఈ దిండు తనంతట తనే సర్దుకుంటుంది కూడా! అమెరికన్ కంపెనీ ‘ప్యూర్–లెక్స్’ తయారు చేసిన ఈ దిండు ఆషామాషీ దిండు కాదు, చాలా స్మార్ట్ తలదిండు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుంది. ఇందులోని సెన్సర్లు నిద్రిస్తున్న వ్యక్తి తీరు తెన్నులను ఎప్పటికప్పుడు గుర్తిస్తాయి. (ఇదీ చదవండి: బొమ్మకారుతో ఆడుకుంటున్న ఈ ప్రపంచ కుబేరుడిని గుర్తుపట్టారా?) గురక మొదలయ్యేట్లు ఉంటే, గురక నివారించేందుకు వీలుగా ఒకవైపు ఎత్తు పెరగడం, ఒక వైపు ఎత్తు కుదించుకోవడం చేస్తుంది. నిద్రిస్తున్న వ్యక్తి తల సౌకర్యవంతంగా ఉండేలా సర్దుకుంటుంది. గురక సమస్యతో బాధపడేవారికి ఈ దిండు చక్కని పరిష్కారం. దీని ధర 134 డాలర్లు (రూ.11,027). -
దిండు లేకుండా పడుకోలేరా? ఈ సమస్యలు తప్పవు
రాత్రిపూట నిద్రించేటప్పుడు చాలామంది తలకింద దిండు పెట్టుకొని పడుకుంటారు. అయితే తక్కువ ఎత్తు ఉన్న దిండు ఫరవాలేదు కానీ, పెద్ద దిండు పెట్టుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. ఇది మొదట్లో తెలియదు కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత ముందుగా మెడ నొప్పి ఎదురవుతుంది. ఈ నొప్పి దీర్ఘకాలికంగా వేధిస్తుంది. కొంతమందికి ఉదయం నిద్రలేవగానే వెన్నులో నొప్పితో బాధపడతారు. మీకు ఇలాంటి సమస్య ఎదురైతే పడుకునేటప్పుడు మీరు ఎత్తయిన దిండు ఉపయోగిస్తున్నట్లు లెక్క. దీనివల్ల వెన్నెముక వంగిపోతుంది. డిస్క్‌లలో దరం పెరిగి వెన్నునొప్పి వస్తుంది. అందువల్ల దిండు లేకుండా నిద్రించడం అలవాటు చేసుకోవాలి. తలలో రక్త ప్రసరణ జరగదు: ఎత్తయిన దిండు పెట్టుకొని నిద్రపోతే తలకి రక్త సరఫరా సరిగ్గా జరగదు. రాత్రిపూట చాలా గంటలు ఇలాగే ఉండటం వల్ల రక్త సరఫరా లేక జుట్టుకు సరైన పోషణ లభించదు. దీనివల్ల జుట్టు రాలే సమస్య మొదలవుతుంది. అంతేకాదు, తరచు తలనొప్పి వస్తుంది. లావుపాటి దిండు పెట్టుకొని నిద్రించడం వల్ల శరీరంలోని కొన్ని భాగాలకి రక్త సరఫరా సరిగ్గా అందక తిమ్మిర్ల సమస్యలు ఏర్పడుతాయి. అందువల్ల మెడనొప్పి ఉండకూడదంటే తక్కువ ఎత్తు ఉండే చిన్న దిండుని ఉపయోగించాలి లేదంటే మెత్తటి టవల్ లేదా పలుచటి దుప్పటిని మడత పెట్టి తలకింద పెట్టుకోవడం ఉత్తమం. -
క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ స్టార్టప్ మూసివేత
న్యూఢిల్లీ: అస్సెల్ మద్దతు కలిగిన క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ స్టార్టప్ ‘పిల్లో’ తన కార్యకలాపాలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. జూలై 31 నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. నియంత్రణల పరంగా అనిశ్చితి, కఠిన వ్యాపార పరిస్థితులను ఇందుకు కారణాలుగా పేర్కొంది. సిరీస్ ఏ రౌండ్లో 18 మిలియన్ డాలర్లు (రూ.147 కోట్లు) సమీకరించిన ఎనిమిది నెలలకే ఈ సంస్థ చేతులెత్తేయడం గమనార్హం. ‘పిల్లో యాప్ ద్వారా ఇక మీదట సేవలు అందించకూడదనే నిర్ణయం తీసుకున్నామని తెలియజేస్తున్నందుకు విచారిస్తున్నాం’’అని సంస్థ తన యూజర్లకు సమాచారం ఇచ్చింది. యూజర్ల నిధులపై వడ్డీ రాబడి ఇక్కడి నుంచి ఉండదని, రివార్డుల విభాగాన్ని యాక్సెస్ చేసుకోలేరని తెలిపింది. జూలై 31 వరకు క్రిప్టో విత్‌డ్రాయల్, జూలై 7 వరకు బ్యాంక్ విత్‌డ్రాయల్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. -
Viral Video: నడిరోడ్డుపై దిండు వేసుకుని పడుకుని హల్చల్
యూట్యూబ్ ఛానల్‌కు సబ్స్క్రైబర్లను, సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకునేందుకు కొందరు ఏం చేసేందుకైనా వెనుకాడటం లేదు. ఒక్కోసారి వారు చేసే పనులు చూస్తే చిర్రెత్తిపోతుంది. కనీస ఇంగితజ్ఞానం కూడా లేకుండా ప్రవరిస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ఘటనే దుబాయ్‌లో జరిగింది. ఓ కంటెంట్ క్రియేటర్ ఏకంగా నడిరోడ్డుపై దిండు వేసుకుని హాయిగా పడుకున్నాడు. జీబ్రా క్రాసింగ్ వద్ద అతడ్ని చూసి అందరూ షాక్ అయ్యారు. అతను అడ్డంగా ఉండటంతో వాహనదారులు వాహనాలను నిలిపివేశారు. దీంతో కాసేపు అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. يالله خذوا !!! 🙂 pic.twitter.com/4aTcWlPWiF — 🇦🇪العليـــاء (@AlAliaLanjawi) October 4, 2022 మనోడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. రోడ్డుపై పడుకుని ట్రాఫిక్‌కు ఇబ్బంది కల్గించడమేగాక, తన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నం చేసినందుకు అరెస్టు చేశారు. అతను ఆసియాకు చెందినవాడని చెప్పారు. చదవండి: 80 ఏళ్ల వృద్ధులు స్కై డైవింగ్‌తో... గిన్నిస్ రికార్డు -
టెక్కు టమారం : నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా?
ఇది అలాంటిలాంటి తలదిండు కాదు, హైటెక్ తలదిండు. అమెరికన్ బహుళజాతి సంస్థ ‘పిల్లోక్యూబ్’ ఈ అధునాతన తలదిండును ‘డ్రీమ్ మెషిన్’ పేరిట రూపొందించింది. ఘనాకారంలో ఉండే ఈ తలదిండులోని సెన్సర్లు, దీనిపై తలపెట్టి నిద్రించేవారు ఏ పరిస్థితుల్లో సౌకర్యవంతంగా ఉంటారో గుర్తించి, తగిన రీతిలో గది వాతావరణాన్ని మార్చేస్తాయి. ఇవి పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తాయి. ‘డ్రీమ్ మెషిన్’లోని సెన్సర్లు గదిలోని ఉష్ణోగ్రతను, గాలిని వినియోగదారునికి సౌకర్యవంతంగా ఉండేలా నియంత్రిస్తాయి. గదిలోని అనవసరపు ధ్వనులను చెవులకు సోకకుండా చేస్తాయి. దీనిపై తలవాల్చి పడుకుంటే, ఎక్కువగా ఇబ్బంది పడకుండా ఇట్టే నిద్రలోకి జారుకోవచ్చని తయారీదారులు చెబుతున్నారు. దీని ధర 129.99 డాలర్లు (రూ.10,389) మాత్రమే! -
భార్య లేకపోతేనేం.. పిల్లో ఉందిగా.. యువకుడి వెకేషన్ ఫోటోలు వైరల్
మనీలా: ఏదైనా పర్యటక ప్రదేశానికి వెళ్లినప్పుడు తోడుగా ఎవరైనా ఉంటే చాలా బాగుంటుంది. ఇక జీవిత భాగస్వామే వెంట ఉంటే ఆ మజానే వేరు. కానీ చివరి నిమిషంలో వెకేషన్‌కు రానని భార్య చెబితే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ యువకుడికి. అయితే భార్య లేకున్నా ఒంటరిగానే టూర్‌కు వెళ్లి అతడు చేసిన పని నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. సరికొత్తగా ఆలోచించాడని అందరూ అతడ్ని అభినందిస్తున్నారు. ఫిలిప్పీన్స్‌కు చెందిన ఈ యువకుడి పేరు రేమండ్ ఫార్చునడో. భార్య జోనీతో పలవన్ రాష్ట్రంలోని కొరన్కు వెకేషన్‌కు వెళ్లాలని చాలా రోజుల క్రితమే ప్లాన్ చేశాడు. అయితే చివరి నిమిషంలో ఆమె రాలేనని చెప్పింది. అయితే ఎలాగైనా టూర్‌కు వెళ్లాలని భావించిన అతడు భార్య లేని లోటు ఉండకూడదు అనుకున్నాడు. దీనికోసం వినూత్న ఆలోచన చేశాడు. భార్య ఫోటోను ముద్రించిన ఓ దిండును ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాడు. టూర్‌కు దాన్ని వెంటతీసుకెళ్లాడు. ఇక తను తిరిగిన ప్రతి చోటుకు ఆ దిండును కూడా తీసుకెళ్లాడు రేమండ్. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఫేస్బుక్లో షేర్ చేశాడు. అవి కాస్తా వైరల్‌గా మారాయి. రేమండ్ ఆలోచన సూపర్ అని కొందరు కామెంట్లు పెట్టారు. అతని భార్య చాలా అదృష్టవంతురాలని మరికొందరు అన్నారు. రేమండ్ తన భార్య ఫోటో ఉన్న దిండును పట్టుకుని పర్యటక ప్రదేశాలను సందర్శించిన ఫొటోలను మీరూ చూసేయండి.. మరో ఆసక్తికర విషయమేంటంటే టూర్‌కు వెళ్లేముందు కొవిడ్ నింబంధనల ప్రకారం తన భార్య ఫోటో ఉన్న దిండుకు కూడా టెంపరేచర్ చెక్ చేయించాడు రేమండ్. ఇతని క్రియేటివ్ ఆలోచనలను చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. చదవండి: కరోనా, మంకీపాక్స్ రెండూ ఒకే రకమైన వైరస్‌లా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..? -
Smart Pillow: నిద్రను కనిపెట్టుకొనే దిండు..
ఈ ఫొటోలో కనిపిస్తున్నది అధునాతనమైన స్మార్ట్ దిండు. దీనిపై తలపెట్టుకుని నిద్రించే వారి నిద్రను ఇది కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉంటుంది. నిద్రకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారికి చక్కని వరప్రసాదం ఈ తలదిండు. అమెరికన్ కెమికల్ సొసైటీ (ఏసీఎస్) పరిశోధకులు ఇటీవల అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ స్మార్ట్ దిండు నమూనాను రూపొందించారు. ఇందులోని ట్రైబో ఎలక్ట్రిక్ నానో జెనరేటర్స్తో పనిచేసే సెన్సర్లు నిద్రను అనుక్షణం కనిపెట్టుకుని ఉంటాయి. నిద్రించేటప్పుడు నిద్రించే వ్యక్తికి సౌకర్యంగా ఉండే భగింమ, గాఢంగా నిద్రించే సమయం వంటివన్నీ క్షుణ్ణంగా ట్రాక్ చేస్తుంది. ఇప్పటి వరకు హెడ్‌బ్యాండ్స్, రిస్ట్‌బ్యాండ్స్ వంటి రూపాల్లో అందుబాటులో ఉన్న స్లీప్ ట్రాకర్స్ కంటే ఇది చాలా మెరుగ్గా పనిచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. -
దిండు 45,00,000 రూపాయలు
అంత డబ్బు పెడితే... ఓ హైఎండ్ కార్ కొనేయొచ్చు. ఓ మోస్తరు ఇల్లు కొనుక్కోవచ్చు. అలాంటిది ఓ మెత్తకు అంత ధర ఉంటుందా? అని నమ్మలేకపోతున్నారు కదూ! కానీ నిజం. దాని విలువ రూ. 45 లక్షలు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు ఇది. నెదర్లాండ్స్‌కు చెందిన ఓ ఫిజియోథెరపిస్ట్ దీన్ని డిజైన్ చేశాడు. ఎంత థెరపిస్ట్ డిజైన్ చేసినా అంత రేటెందుకు అంటే? దాని ధర వెనుక 15 ఏళ్ల కఠోర శ్రమ ఉంది. అంతేకాదు అందులో ఉన్న దూదిని రోబోటిక్ మిల్లింగ్ మెషీన్‌తో తయారు చేశారు. నిద్రరాకుండా బాధపడేవారు, వివిధ రకాల మెడ నొప్పులతో ఇబ్బందులు పడేవాళ్లను సైతం ఈజీగా నిద్రపుచ్చేస్తుందీ మెత్త. అంత సౌకర్యంగా ఉంటుంది మరి. అలాగే ఈ దిండును బంగారం, నీలమణులను పొదిగి మరీ తయారు చేశారు. మెత్త కవర్ జిప్ డిజైన్‌కు నాలుగు వజ్రాలను ఉపయోగించారు. ఇక సాధారణ మాల్స్‌లో ఇచ్చినట్టుగా దీన్ని కవర్లో పెట్టి ఇవ్వరు. దానికోసమే ప్రత్యేకంగా రూపొందించిన బ్రాండెడ్ బాక్స్‌లో ప్యాక్‌చేసి మరీ ఇస్తారట. -
రైల్వే ప్రయాణికుల కోసం, కేంద్రం కీలక నిర్ణయం
రైల్వే ప్రయాణికుల కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ రైల్వే శాఖ ప్రయాణికుల కోసం డిస్పోజబుల్ బెడ్ షీట్లను అందించనుంది. వీటితో పాటు టూత్ పేస్ట్, మాస్క్, బెడ్ షీట్లను అందిస్తుంది. అయితే ఈ సదుపాయం రైల్వే శాఖ ఎంపిక చేసిన ట్రైన్లలో మాత్రమే ఉండనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. మూడు రకాల డిస్పోజబుల్ బెడ్‌రోల్ కిట్లు రైలులో మూడు రకాల డిస్పోజబుల్ బెడ్‌రోల్ కిట్లు అందుబాటులో ఉంటాయి. ఒక కిట్‌లో నాన్ ఓవెన్ పిల్లో (నేసిన దిండు) దాని కవర్,డిస్పోజబుల్ బ్యాగ్, టూత్‌పేస్ట్, టూత్ బ్రష్, హెయిర్ ఆయిల్, దువ్వెన, శానిటైజర్ , పెప్పర్ సోప్, టిష్యూ పేపర్లు ఉంటాయి. ఈ కిట్ ధర రూ. 300గా ఉంది. ఒక ప్రయాణికుడు ఒక దుప్పటిని మాత్రమే కొనుగోలు చేయాలనుకుంటే రూ. 150 చెల్లించాల్సి ఉంటుంది. కాగా కేంద్ర రైల్వే శాఖ నిర్ణయించిన రైళ్లలో సంబంధిత శాఖకు చెందిన కార్మికులు రైళ్లలో అమ్ముతారని రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ట్రైన్లు ఇవే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ట్రైన్లు ఈ డిస్పోజబుల్ బెడ్ షీట్లు సుదూర ప్రాంతాలకు జర్నీ చేసే ప్రయాణికుల కోసం అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర రైల్వే శాఖ తెలిపింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ముంబై - ఢిల్లీలో రాజదాని ఎక్స్ ప్రెస్, ముంబై - ఢిల్లీ ఆగస్ట్ క్రాంతి రాజధాని ఎక్స్ ప్రెస్, గోల్డెన్ టెంపుల్ మెయిల్, పశ్చిమ్ ఎక్స్‌ప్రెస్ లలో అందుబాటులో ఉంది. బెడ్ షీట్లను సౌకర్యం కల్పించినందుకు గాను కేంద్రం ప్రయాణికుల నుంచి అదనంగా రూ.150వసూలు చేయనుంది. జోన్లను బట్టి ధరలు మారతాయ్ డిస్పోజబుల్ బెడ్ షీట్ కిట్ల ధరలు జోన్లను బట్టి మారవచ్చు. కొన్ని ప్రాంతాల్లో కిట్‌లో టూత్‌పేస్ట్, శానిటైజర్లు ఇస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో దుప్పట్లు, దిండ్లు, షీట్లు మాత్రమే అందిస్తున్నారు. చదవండి: ఉద్యోగుల కోసం క్యాబిన్లు, ఇకపై ట్రైన్లలో ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు -
నెలల వయసున్న చిన్నారికి.. ఇంత పెద్ద ఐడియా ఎలా వచ్చింది?
సాధారణంగా ఏదైనా.. నేర్చుకోవాలనే తపన.. సాధించాలనే ఆశయం ఉన్నవారు చుట్టు జరుగుతున్న ప్రతి సంఘటన నుంచి ప్రేరణ పొందుతుంటారు. చాలా మంది తమ జీవితంలో గొప్ప గొప్ప కలలు, ఆశయాలను పెట్టుకుంటారు. దాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలో కొందరు.. కొన్ని ఆటంకాలు ఎదురుకాగానే ఆ పనిని మధ్యలోనే వదిలేస్తారు. మరికొందరు మాత్రం.. తమ పట్టును వదలకుండా చివరి వరకు ఉండి తమకు కావాల్సిన దాన్ని సాధించుకుంటారు. వారికి మాత్రమే గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి. తాజాగా, ఇలాంటి స్ఫూర్తివంతమైన వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ తన ట్వీటర్ ఖాతాలో పోస్టు చేశారు. దానికి ‘ కోశిశ్ కర్నేవాలోకీ హార్ నహీ హోతి హై..’ అంటే ‘నిరంతరం ప్రయత్నం చేసేవారు.. ఎప్పటికీ ఓటమి బారినపడరంటూ’ ట్యాగ్ చేశారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో నెలల వయసున్న అందమైన బుజ్జాయి మంచంపై కూర్చోని ఉంది. ఆ పసిపాప దగ్గరలో ఆమె తల్లిదండ్రులు లేరు. అయితే.. ఆ పాప.. తన తల్లికోసం అటూ ఇటూ చూసింది. మంచంపై నుంచి దిగాలనుకుంది. మంచం ఎత్తుగా ఉండటంతో ఆ బాలిక కిందపడిపోతానేమోనని భయపడింది. మంచంపైన కొన్ని దిండులు, బెడ్షీట్లు ఉన్నాయి. ఆ బాలిక నెమ్మదిగా పాకుతూ.. ఒక బెడ్షిట్ను మెల్లగా మంచం కింద పడేసింది. దాన్ని ఆధారంగా చేసుకుని దిగాలనుకుంది. నెమ్మదిగా చూసింది. పాపం.. చిన్నారికి కాళ్లు అందలేవు. ఆ తర్వాత.. మరో బెడ్షిట్ను కిందపడేసి చూసింది. అప్పుడు కూడా ఆధారందొరకలేదు. ఇప్పుడు అలాకాదని.. ఒక దిండుని లాగి కిందపడేసింది. ఇప్పుడు.. కొద్దిగా అందినట్లే ఉన్నా.. పూర్తి స్థాయిలో ఆధారం దొరకలేదు. చివరకు ఇలాకాదని .. ఆ బాలిక మరో ట్రిక్ వేసింది. మంచంపై ఉన్న మరో దిండును లాగి కింద పడేసింది. ఆ తర్వాత.. నెమ్మదిగా ఆ దిండును ఆధారం చేసుకుని నవ్వుతూ.. ఆనందంగా కిందకు దిగేసింది. చివరకు తన ప్రయత్నం ఫలించినందుకు చిన్నారి ఆనందంతో ముసిముసినవ్వులు నవ్వింది. కాగా, ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వావ్.. చిన్నారి ఎంత ముద్దుగా ఉందో..’, అంత చిన్న వయసులో ఐడియా ఎలా తట్టింబ్బా..’,‘ కష్టపడేవారికి ఎప్పటికైన విజయం లభిస్తోందంటూ..’ కామెంట్లు చేస్తున్నారు. -
మీ తలగడ, పరుపు సౌకర్యంగా ఉన్నాయా?
మనలో చాలామందికి మంచి సౌకర్యవంంతమైన పడక, మన తలగడ ఎలా ఉండాలో తెలియదు. ఇంకా కొందరికైతే వీటి విషయంలో కొన్ని అపోహలూ ఉంటాయి. చాలామంది నిద్ర సమయంలో తలగడ వాడకపోవడమే మంచిదని అనుకుంటుంటారు. వాస్తవానికి మంచి నిద్ర కోసం సరైన తలగడ వాడాలి. రాత్రివేళ నిద్రలో మనం చాలాసార్లు అటు పక్కకూ, ఇటు పక్కకూ తిరగాల్సి వస్తుంది. అలా పక్కకు తిరిగి పడుకున్న సమయంలో తలకూ, పడకకూ మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ కారణంగా సుఖంగా నిద్రపోవడం సాధ్యం కాదు. అందుకే మంచి తలగడను ఉపయోగించడం వల్ల ఆ గ్యాప్ లేకుండా చూసుకోవడం సాధ్యమవుతుంది. ఫలితంగా దేహంలో మన తలకూ, మిగతా శరీరానికీ ఒకేలాంటి సమానమైన ఒత్తిడి పడేలా చేసుకోవడం వల్లనే సౌకర్యవంతమైన నిద్రపోవడం సాధ్యమవుతుంది. అయితే ఎంత మంచి తలగడనైనా రెండేళ్లకు మించి వాడకూడదు. ఎందుకంటే రెండేళ్ల తర్వాత తలగడ తన కంప్రెసబిలిటీనీ, ఎలాస్టిసిటీని కోల్పోతుంది. అందుకే కొందరు అప్పటికీ తలగడ ఉన్నా దాని సపోర్ట్ సరిపోక మళ్లీ భుజాన్ని కూడా వాడుతుంటారు. మంచి తలగడ ఎలా ఉండాలంటే... ► తలగడ మృదువుగా భుజాలు, తల పట్టేంత సైజులో ఉండాలి ► తలగడను కేవలం తలకింద మాత్రమే అమరేలా కాకుండా... కొంత భాగం భుజాల కిందికీ వచ్చేలా అమర్చుకోవాలి. దీనివల్ల స్పాండిలోసిస్ కారణంగా వచ్చే మెడనొప్పి రాకుండా ఉంటుంది. ఇలా స్పాండిలోసిస్, మెడనొప్పి, భుజాల నొప్పి వంటి సమస్యలు ఉన్నవారు తమకు అనువుగా ఉండేలా తలగడను ఎంచుకోవాలి. అమర్చుకోవాలి ► కుటుంబంలో ఎవరి తలగడ వారికి వేరుగా ఉండాలి. పిల్లలకు కూడా వాళ్ల తలగడ వాళ్లకే ఉండేలా చూడాలి ► తలగడ మీద ఉండే డస్ట్‌మైట్స్‌తో కొందరికి అలర్జీలూ, ఆస్తమా కూడా రావచ్చు. అందుకే తలగడను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇందుకోసం ఉతికిన పిల్లోకవర్ తొడిగిన తలగడనే వాడాలి. పిల్లోకవర్ను ఎప్పటికప్పుడు ఉతుక్కోవాలి. పడక విషయానికి వస్తే... చాలా మంది పరుపు మీద పడుకోవడం మంచిది కాదని అంటారు. వీపునొప్పితో బాధపడే చాలామంది పరుపు వాడకూడదని, గట్టి ఉపరితలం మీద పడుకోవాలని అంటుంటారు. అలాంటివారు చెక్కబల్ల మీద పడుకుంటూ ఉండటమూ చాలా మంది విషయంలో చూస్తుంటాం. వాస్తవానికి అది సరికాదు. నిజానికి మంచి పరుపు మీద పడుకోవడమే మంచిది. అది శరీరానికి గట్టిగా ఒత్తుకోకుండా ఉండేంత మృదువుగానూ ఉండాలి. అదే సమయంలో మనం అందులోకి మరీ కూరుకుపోయేలా కూడా ఉండకూడదు. నిపుణులు చెప్పే ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకోలేక, గట్టి ఉపరితలం మీద పడుకోవాలని అపోహ పడుతుంటారు. గట్టి ఉపరితలం మీద పడుకుంటే ఒంట్లో చాలా భాగాలు నొక్కుకుపోయి, అలా నొక్కుకుపోయిన చోట్ల నొప్పి వస్తుంది. అందుకే పరుపును ఎంపిక చేసే సమయంలో అది శరీరానికి ఒత్తుకోకుండా మృదువుగా ఉండటంతో పాటు మనం కూరుకుపోకుండా ఉండేలాంటి పరుపును తీసుకోవాలి. పరుపు వాడే సమయంలోనూ ప్రతివారం దాన్ని తిరగవేయడం మంచిది. ఎందుకంటే ఒకేవైపు వాడుతుంటే శరీరం బరువు ఒకేచోట పడి అది తన ఎలాస్టిసిటీని కోల్పోయి, గుంటలా పడుతుంది. అందుకే మార్చి మార్చి వాడాలి. ఒక పరుపును మూడేళ్ల పాటు వాడుకోవచ్చు. ఆ తర్వాత మార్చడమే మంచిది. -
వైరల్‌గా మారిన తమన్నా పిల్లో చాలెంజ్
లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన సినీ సెలబ్రిటీలు వివిధ చాలెంజ్‌లతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇంటి పనుల్లో ఆడవాళ్లకు సాయం చేయాలనే కాన్సెప్ట్‌తో ప్రారంభమైన బి ది రియల్ మ్యాన్ చాలెంజ్ టాలీవుడ్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. మరోవైపు పలువురు హీరోయిన్లు పిల్లో చాలెంజ్ పేరుతో అభిమానులను అలరిస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్లు పాయల్ రాజ్‌పుత్, పరుల్ యాదవ్, సింగర్ నేహా కక్కర్ ఈ చాలెంజ్‌ను పూర్తి చేశారు. కేవలం పిల్లో మాత్రమే ధరించిన ఫొటోలను వారు తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా పిల్లో చాలెంజ్‌ను స్వీకరించారు. పిల్లో చాలెంజ్‌ను పూర్తి చేసిన తమన్నా.. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమన్నా పిలో చాలెంజ్ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. మరోవైపు లాక్‌డౌన్‌తో షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఇంటికే పరిమితమైన తమన్నా.. ఈ సమయంలో వర్క్ అవుట్స్ చేయడంతోపాటు, వంట కూడా ట్రై చేస్తున్నారు. అలాగే తన చిన్ననాటి జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. చదవండి : అల్లువారి కోడలి ఫన్నీ చాలెంజ్.. -
కాలునే దిండుగా..
ఝాన్సీ: ఉత్తరప్రదేశ్‌లో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. ఝాన్సీ పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి కాలును తొలగించిన వైద్యులు.. ఆ కాలును తలగడగా వినియోగించి మరోసారి అమానవీయంగా వ్యవహరించారు. క్యాజువాలిటీ వార్డ్‌లో స్ట్రెచర్‌పై పడుకున్న రోగి.. ఆయన తలగడగా తొలగించిన కాలున్న వీడియోను ఓ స్థానిక టీవీ ప్రసారం చేసింది. దీంతో ఈ ఆసుపత్రి డాక్టర్ల తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఓ స్కూలు బస్సుకు క్లీనర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని.. శనివారం బస్సు ప్రమాదంలో కాలు విరగటంతో హుటాహుటిన ఝాన్సీ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. అయితే ఇన్ఫెక్షన్ శరీరమంతా వ్యాపించకుండా ఉండేందుకు డాక్టర్లు వెంటనే కాలు తీసేశారు. అనంతరం, బెడ్‌పై కాకుండా స్ట్రెచర్‌పైనే ఆ వ్యక్తికి చికిత్సనందించిన డాక్టర్లు.. ఆ వ్యక్తికి ఆయన కాలునే తలగడగా పెట్టారు. దీన్ని స్థానిక మీడియా బయటపెట్టడంతో ఈ విషయం ప్రభుత్వ ఉన్నతాధికారుల వరకూ వెళ్లింది. దీనిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే, తొలగించిన కాలు ఎలా గదిలోకి వచ్చిందో తెలియదని డాక్టర్లంటున్నారు. ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఆసుపత్రిలోనే కాలు తొలగించామని, లోపలకు ఎలా వచ్చిందో తెలియదని చెబుతుండగా.. ప్రమాదం జరిగిన చోటే కాలు తెగిపోయిందని, కుటుంబ సభ్యులు దీన్ని తీసుకొచ్చి ఉంటారని మరికొందరంటున్నారు. అయితే.. ఈ ఆసుపత్రిలో స్వీపర్లు, వార్డ్బాయ్లే చిన్న చిన్న సర్జరీలు చేస్తున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. -
తలదిండులో రూ.2.50 లక్షల నగదు!
రాయదుర్గం రూరల్ : తలదిండులో రూ.2.50 లక్షల నగదు లభ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. డి.కొండాపురానికి చెందిన బోయ ఎర్రప్ప, హనుమక్క (70) దంపతులు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తెకు పెళ్లి చేసి మెట్టినింటికి పంపించారు. ఎర్రప్ప కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి మతిస్థిమితం సరిగా లేని కుమారుడు రాజుతో కలిసి హనుమక్క నివాసం ఉంటోంది. వీరికి 7.60 ఎకరాల మెట్ట పొలం ఉంది. భూమి ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇంట్లోనే దాచుకునేది. ఆరు నెలల క్రితం కాలు విరిగి మంచానపడింది. అనారోగ్యంతో ఆదివారం మరణించింది. ఆదివారం ఆమె మృతదేహాన్ని బంధువులు ఇంటిలోంచి బయటకు తీశారు. హనుమక్క వాడే తలదిండును కూడా బయటపడేసేందుకని తీసుకొచ్చారు. అయితే అందులో పేపర్ శబ్దం రావడంతో తెరిచి చూశారు. అందులో రూ.2.50 లక్షల నగదు బయటపడింది. అందులో లక్ష రూపాయలు తడిచి, చిరిగిపోయి పనికిరాకుండా పోయాయి. మిగిలిన లక్షన్నర రూపాయలలో పాత రూ.100, రూ.500, రూ.1000 నోట్లు ఉన్నాయి. ఈ మొత్తాన్ని బంధువుల్లో ఒకరైన వన్నూరుస్వామికి గ్రామపెద్దల సమక్షంలో అప్పగించారు. -
ఫోన్ తలగడ కింద పెట్టుకుంటే అంతే!
న్యూయార్క్: మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా. అయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పడుకునే ముందు స్మార్ట్ ఫోన్ కొంచెం దూరంగా పెట్టే పడుకుంటే మంచిది. ఇక చార్జింగ్ పెట్టినయితే తీసేయడం మర్చిపోవద్దు. తన స్మార్ట్ ఫోన్ కు చార్జింగ్ పెట్టి నిద్రపోయిన ఓ అమెరికా బాలిక తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఉత్తర టెక్సాస్ లో ఈ ఘటన గురించి స్థానిక మీడియా వెల్లడించింది. 13 ఏళ్ల బాలిక తన సామ్సంగ్ గెలాక్సీ ఎస్4 ఫోన్‌కు చార్జింగ్ పెట్టి తలకింద పెట్టుకుని నిద్రపోయింది. చాలాసేపటి తర్వాత కాలిన వాసన రావడంతో ఆ బాలిక మేల్కోంది. అప్పటికే తలగడకు కొద్దిగా మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన బాలిక అక్కడి నుంచి దూరంగా జరిగింది. ఎక్కువగా చార్జింగ్ పెట్టడం బ్యాటరీ వేడెక్కి మంటలంటుకుని ఉండొచ్చని బాలిక తండ్రి తెలిపారు. అయితే ఫోన్ తలగడ కింద పెట్టుకోవద్దని సామ్సంగ్ కోరింది. -
ముద్దులు నేర్పే దిండు
లండన్: తొలిముద్దు.. ప్రేమికులు కలకాలం గుర్తిండిపోయేలా ఉండాలని కలలు కంటారు. అసలే కొత్త. ఆపై భయం. దీంతో ముద్దు ముచ్చట తీరకపోతే తీవ్ర నిరాశే. అయితే ఇకపై వాళ్లు భయపడక్కర్లేదు. ఎందుకంటే ముద్దుల్ని ముందే ప్రాక్టీసు చేసుకోవచ్చు. యువ‘కల’లను దష్టిలో పెట్టుకుని అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన డిజైనర్ ఎమిలీ కింగ్(26) ఒక ప్రత్యేక దిండుని రూపొందించింది. దీని మధ్యలో సీపీఆర్ (కార్డియోపల్మనరీ రిససైటేషన్) డమ్మీలు పెట్టి కుట్టిన కత్రిమ పెదవులు ఉంటాయి. ఇవి అచ్చం పెదవుల్లాగే ఉండి ముద్దులు పెట్టడంలో మంచి ప్రాక్టీస్నిస్తాయని ఎమిలీ ముద్దు ముద్దుగా చెప్పింది. దిండు ఆలోచన తన స్నేహితులు ముందు పెట్టినపుడు.. 25 ఏళ్ల పైబడిన వారు వ్యతిరేకించారని, కాలేజీ విద్యార్థులయితే ఆహా, ఓహో, అదుర్స్ అంటూ ప్రశంసించారని తెలిపింది. తన దిండు పని పూర్తయే వరకూ తాను కూడా ఎంతో ఉత్సుకతతో ఉన్నానంది ఎమిలీ. ఈ దిండు ఒంటరి జీవుల ముద్దుముచ్చటను కూడా తీరుస్తుందని తెలిపింది.