ఈ దిండుతో గురకకు చెప్పండి గుడ్ బై.. ఇది చాలా స్మార్ట్ గురూ! | Say goodbye to snoring with this smart pillow | Sakshi
Sakshi News home page

ఈ దిండుతో గురకకు చెప్పండి గుడ్ బై.. ఇది చాలా స్మార్ట్ గురూ!

Published Sun, Jul 23 2023 7:19 AM | Last Updated on Sun, Jul 23 2023 7:22 AM

Say goodbye to snoring with this smart pillow - Sakshi

ఈ దిండు గురక నివారిణి. దీని మీద తలపెట్టుకుని ఆదమరచి నిద్రించినట్లయితే, గురక బెడద ఉండదు. నిద్రలో అటూ ఇటూ కదిలేటప్పుడు తల ఎటు తిరిగితే అటువైపు ఈ దిండు తనంతట తనే సర్దుకుంటుంది కూడా! 

అమెరికన్‌ కంపెనీ ‘ప్యూర్‌–లెక్స్‌’ తయారు చేసిన ఈ దిండు ఆషామాషీ దిండు కాదు, చాలా స్మార్ట్‌ తలదిండు. ఇది ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుంది. ఇందులోని సెన్సర్లు నిద్రిస్తున్న వ్యక్తి తీరు తెన్నులను ఎప్పటికప్పుడు గుర్తిస్తాయి.

(ఇదీ చదవండి: బొమ్మకారుతో ఆడుకుంటున్న ఈ ప్రపంచ కుబేరుడిని గుర్తుపట్టారా?)

గురక మొదలయ్యేట్లు ఉంటే, గురక నివారించేందుకు వీలుగా ఒకవైపు ఎత్తు పెరగడం, ఒక వైపు ఎత్తు కుదించుకోవడం చేస్తుంది. నిద్రిస్తున్న వ్యక్తి తల సౌకర్యవంతంగా ఉండేలా సర్దుకుంటుంది. గురక సమస్యతో బాధపడేవారికి ఈ దిండు చక్కని పరిష్కారం. దీని ధర 134 డాలర్లు (రూ.11,027).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement