భార్య లేకపోతేనేం.. పిల్లో ఉందిగా.. యువకుడి వెకేషన్ ఫోటోలు వైరల్‌ | Philippines Man Vacation Pillow With Wifes Face | Sakshi
Sakshi News home page

చివరి నిమిషంలో వెకేషన్‌కు రానన్న భార్య.. భర్త చేసిన పనికి నెటిజన్లు ఫిదా..

Published Tue, Jul 26 2022 6:33 PM | Last Updated on Tue, Jul 26 2022 7:15 PM

Philippines Man Vacation Pillow With Wifes Face - Sakshi

భార్య లేకున్నా ఒంటరిగానే టూర్‌కు వెళ్లి అతడు చేసిన పని నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. సరికొత్తగా ఆలోచించాడని అందరూ అతడ్ని అభినందిస్తున్నారు.

మనీలా: ఏదైనా పర్యటక ప్రదేశానికి వెళ్లినప్పుడు తోడుగా ఎవరైనా ఉంటే చాలా బాగుంటుంది. ఇక జీవిత భాగస్వామే వెంట ఉంటే ఆ మజానే వేరు. కానీ చివరి నిమిషంలో వెకేషన్‌కు రానని భార్య చెబితే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ యువకుడికి. అయితే భార్య లేకున్నా ఒంటరిగానే టూర్‌కు వెళ్లి అతడు చేసిన పని నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. సరికొత్తగా ఆలోచించాడని అందరూ అతడ్ని అభినందిస్తున్నారు.

ఫిలిప్పీన్స్‌కు చెందిన ఈ యువకుడి పేరు రేమండ్ ఫార్చునడో. భార్య జోనీతో పలవన్ రాష్ట్రంలోని కొరన్‍కు వెకేషన్‌కు వెళ్లాలని చాలా రోజుల క్రితమే ప్లాన్ చేశాడు. అయితే చివరి నిమిషంలో ఆమె రాలేనని చెప్పింది. అయితే ఎలాగైనా టూర్‌కు వెళ్లాలని భావించిన అతడు భార్య లేని లోటు ఉండకూడదు అనుకున్నాడు. దీనికోసం వినూత్న ఆలోచన చేశాడు. భార్య ఫోటోను ముద్రించిన ఓ దిండును ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాడు. టూర్‌కు దాన్ని వెంటతీసుకెళ్లాడు. ఇక తను తిరిగిన ప్రతి చోటుకు ఆ దిండును కూడా తీసుకెళ్లాడు రేమండ్. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. అవి కాస్తా వైరల్‌గా మారాయి. రేమండ్ ఆలోచన సూపర్ అని కొందరు కామెంట్లు పెట్టారు. అతని భార్య చాలా అదృష్టవంతురాలని మరికొందరు అన్నారు. 

రేమండ్ తన భార్య ఫోటో ఉన్న దిండును పట్టుకుని పర్యటక ప్రదేశాలను సందర్శించిన ఫొటోలను మీరూ చూసేయండి..

మరో ఆసక్తికర విషయమేంటంటే టూర్‌కు వెళ్లేముందు కొవిడ్ నింబంధనల ప్రకారం తన భార్య ఫోటో ఉన్న దిండుకు కూడా టెంపరేచర్ చెక్ చేయించాడు రేమండ్‌. ఇతని క్రియేటివ్ ఆలోచనలను చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు.

చదవండి: కరోనా, మంకీపాక్స్‌ రెండూ ఒకే రకమైన వైరస్‌లా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement