విద్యార్థులు పరీక్ష రాసేసమయంలో కాపీ కొట్టకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు వాళ్లను పర్యవేక్షించే సిబ్బంది. అయితే ఫిలిప్పీన్స్‌లోని బికోల్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ ప్రొఫెసర్ వినూత్న ఆలోచన చేశారు. 'నో చీటింగ్' పేరుతో పరీక్ష రాసే సమయంలో తలలు తిప్పకుండా టోపీ, లేదా వస్త్రం ధరించాలని విద్యార్థులను ఆదేశించారు.
అయితే స్టూడెంట్స్ కూడా వీరిక తగ్గట్టే క్రేజీగా అలోచించారు. తమ క్రియేటివిటీని ఉపయోగించి రకాల రకాల టోపీలు, హ్యాట్‌లను తయారు చేసుకుని వచ్చారు. పేపర్లు, కార్డ్ బోర్డ్, ఎగ్ బాక్సెస్, రీసైకిల్డ్ మెటీరియల్ ఉపయోగించి వివిధ రకాల ఆకృతుల్లో హెల్మెట్‌లా వాటిని ధరించి పరీక్ష రాశారు. ఎవరివైపు చూడకుండా, కాపీయింగ్‌కు పాల్పడుకుండా నిజాయితీగా ఉన్నారు.
విద్యార్థులు పరీక్ష రాసే సమయంలో ధరించిన హ్యాట్‌లు, హెల్మెట్‌లకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. యూనివర్సిటీ ప్రొఫెసర్ మేరి జోయ్ మాండేన్ ఆర్టిజ్ మాట్లాడుతూ.. స్టూడెంట్స్ అందరూ సమగ్రతతో నిజాయితీగా ఉండాలనే ఈ ఆలోచన చేసినట్లు చెప్పారు. 2013లో థాయ్‌లాండ్‌లో ఇలా చేయడం చూశానని, ఇప్పుడు దాన్నే అమలు చేశామని పేర్కొన్నారు.
Students Wear Bizarre ‘Anti-Cheating Hats’ In Philippines College, Video Goes Viral#TNShorts #Cheating #Philippines pic.twitter.com/wdmp5C7OYP
— TIMES NOW (@TimesNow) October 24, 2022
చదవండి: పోటీ నుంచి తప్పుకున్న బోరిస్.. బ్రిటన్ కొత్త ప్రధానిగా రిషి సునాక్!
Comments
Please login to add a commentAdd a comment