copying in exams
-
స్టూడెంట్స్ కాపీ కొట్టకుండా సూపర్ ఐడియా.. ఫోటోలు వైరల్
విద్యార్థులు పరీక్ష రాసేసమయంలో కాపీ కొట్టకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు వాళ్లను పర్యవేక్షించే సిబ్బంది. అయితే ఫిలిప్పీన్స్‌లోని బికోల్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ ప్రొఫెసర్ వినూత్న ఆలోచన చేశారు. 'నో చీటింగ్' పేరుతో పరీక్ష రాసే సమయంలో తలలు తిప్పకుండా టోపీ, లేదా వస్త్రం ధరించాలని విద్యార్థులను ఆదేశించారు. అయితే స్టూడెంట్స్ కూడా వీరిక తగ్గట్టే క్రేజీగా అలోచించారు. తమ క్రియేటివిటీని ఉపయోగించి రకాల రకాల టోపీలు, హ్యాట్లను తయారు చేసుకుని వచ్చారు. పేపర్లు, కార్డ్ బోర్డ్, ఎగ్ బాక్సెస్, రీసైకిల్డ్ మెటీరియల్ ఉపయోగించి వివిధ రకాల ఆకృతుల్లో హెల్మెట్‌లా వాటిని ధరించి పరీక్ష రాశారు. ఎవరివైపు చూడకుండా, కాపీయింగ్‌కు పాల్పడుకుండా నిజాయితీగా ఉన్నారు. విద్యార్థులు పరీక్ష రాసే సమయంలో ధరించిన హ్యాట్లు, హెల్మెట్లకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. యూనివర్సిటీ ప్రొఫెసర్ మేరి జోయ్ మాండేన్ ఆర్టిజ్ మాట్లాడుతూ.. స్టూడెంట్స్ అందరూ సమగ్రతతో నిజాయితీగా ఉండాలనే ఈ ఆలోచన చేసినట్లు చెప్పారు. 2013లో థాయ్‌లాండ్‌లో ఇలా చేయడం చూశానని, ఇప్పుడు దాన్నే అమలు చేశామని పేర్కొన్నారు. Students Wear Bizarre ‘Anti-Cheating Hats’ In Philippines College, Video Goes Viral#TNShorts #Cheating #Philippines pic.twitter.com/wdmp5C7OYP — TIMES NOW (@TimesNow) October 24, 2022 చదవండి: పోటీ నుంచి తప్పుకున్న బోరిస్.. బ్రిటన్ కొత్త ప్రధానిగా రిషి సునాక్! -
చిచ్చర పిడుగు! ఎగ్జామ్స్‌లో కాపీ కొట్టేందుకు కొత్త ఎత్తులు..
పరీక్షల టైంలో విద్యార్ధులు కాపీ కొట్టకుండా టీచర్లు వెయ్యి కళ్లతో కాపేసుంటారు. ఐనా! కొందరుంటారులే.. అబ్బో కాపీ కొట్టడానికి మామూలు తెలివితేటాలు చూపించరు. ఇలా కూడా కాపీ కొడతారా అనే రేంజిలో ఉంటాయి మరి పథకాలు. అసలే కరోనా కాలంలో అంతంత మాత్రపు అత్తెసురు చదువులతో ఊగిసలాడుతుంటే, కొంతమంది విద్యార్ధులు ఎలాగోల పాస్ అయితే చాలు దేవుడా అన్నట్లు పరిస్థితులను తమకనుగునంగా ఎలా మార్చుకుంటున్నారో ఈ వీడియోపై జస్ట్ ఓ శాంపిల్ లుక్కెయ్యండి. క్లాస్ రూంలో మాస్కులు ధరించి ఎగ్జాం రాస్తున్న విద్యార్ధులు ఈ వీడియోలో కనిపిస్తారు. వీళ్లలో ఓ విద్యార్ధి మాస్కులోపల స్లిప్ పెట్టి దానిని చూసి పరీక్ష రాయడం కనిపిస్తుంది. ఐతే వెనుక కూర్చున్న విద్యార్ధి ఆశ్చర్యంతో నవ్వడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. సామాజిక మాద్యమాల్లో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతుంది. కపీ ఇలా కూడా జరుగుతుందని ఎవరూహించరని ఒకరు, కరోనా విపత్తును అవకాశంగా మార్చుకున్నాడని మరొకరు ఇలా నెటిజన్లు సరదాగా వేల కామెంట్లు చేస్తున్నారు. విద్యార్ధుల భవిష్యత్తుకు అది అంత మంచి మార్గం కాదనేది మనందరికీ తెలిసిందే! ఏదిఏమైనా కష్టపడేవారి కోసమే రాజమార్గాలు తెరచుకుంటాయనేది నిత్యసత్యం. మీరేమంటారు...? చదవండి: Omicron Outbreak: ఇప్పట్లో స్కూళ్లు తెరిచేదే లేదు! View this post on Instagram A post shared by memes | news | comedy (@ghantaa) -
ఇంటర్ పరీక్షలు..యువతి ఆత్మహత్యాయత్నం..!
-
ఇంటర్ పరీక్షలు..యువతి ఆత్మహత్యాయత్నం..!
సాక్షి, వరంగల్ అర్బన్ : ఇంటర్మీడియట్ పరీక్షలు నేడు (బుధవారం) మొదయ్యాయి. ఎలాంటి అక్రమాలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎగ్జామ్ సెంటర్లలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అయితే, హన్మకొండలోని నయీంనగర్‌లో గల ఆర్డీ కళాశాలలో ఒక విద్యార్థిని కాపీయింగ్‌కు పాల్పడుతుండగా.. కాలేజీ సిబ్బంది గుర్తించారు. దీంతో అవమాన భారానికి గురైన పోలసాని రక్షరావు (16) కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. తీవ్ర గాయాలపాలైన రక్షను ఆస్పత్రికి తరలించారు. (తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభం) తెలంగాణలో 9లక్షల 42వేల 719 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు సిద్ధమయ్యారు. తెలంగాణ బోర్డు తమ విద్యార్థుల కోసం 1277 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది. తెలంగాణలో 32సమస్యాత్మక కేంద్రాలున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని, ఉదయం 8 గంటల 45 నిమిషాల్లోగా పరీక్ష హాల్లోకి చేరుకోవాలని అధికారులు ఇప్పటికే సూచించారు. 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు స్పష్టంచేశారు. -
ట్రైనీ ఐపీఎస్: కాపీయింగ్‌లో మరిన్ని నిజాలు
సాక్షి, హైదరాబాద్ : ట్రైనీ ఐపీఎస్ సఫీర్ కరీం హైటెక్ మాస్ కాపీయింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కొచ్చి, తిరువనంతపురం, హైదరాబాద్‌లలోని కోచింగ్ కేంద్రాల్లో చాలా కాలం నుంచే ఇలాంటి మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలుతున్నట్లు సమాచారం. విద్యార్థులతో మాస్‌కాపీయింగ్‌కు తన వద్దనున్న ఎలక్ట్రానిక్ పరికరాలు, గూగుల్ క్లౌడ్ స్టోరేజీని వినియోగించినట్లు అనుమానిస్తున్నారు. ఇందుకోసం బ్లూటూత్, మీనియేచర్ కెమెరాలను ఉపయోగించినట్లు నిర్థారణకు వచ్చారు. మాస్ కాపీయింగ్‌కు 1.5 కిలోమీటర్ల పరిధిలోపు పనిచేసే వైర్లెస్ మోడమ్‌ను ఉపయోగించినట్లు గుర్తించారు. ప్రస్తుతం కరీం గూగుల్ డ్రైవ్ అకౌంట్‌ను చెన్నై పోలీసులు పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా, అతడు రాసిన గత ప్రవేశ పరీక్షల వివరాలూ సేకరిస్తున్నారు. మాస్ కాపీయింగ్ కోసం విద్యార్థుల నుంచి కరీం భారీ మొత్తాలు వసూలు చేసినట్లు గుర్తించారు. ఇప్పటికే కరీంతో పాటు అతడి భార్య జాయ్సీ జాయ్, హైదరాబాద్‌లోని లా ఎక్సలెన్స్ కోచింగ్ సెంటర్ ఇంచార్జి పి.రాంబాబును ఇటీవల అరెస్టు చేసిన విషయం విదితమే. వీరి నుంచి 11 సెల్ఫోన్లు, ఒక ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్, నాలుగు హార్డ్ డిస్క్‌లు, ఒక పెన్ డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని మైలాపూర్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపారు. మరో రెండు వారాల్లో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వస్తుందని భావిస్తున్నారు. కాగా కుమార్తెను చూసుకునేందుకు బెయిల్ మంజూరు చేయాలని కరీం భార్య జాయ్సీ జాయ్ విజ్ఞప్తితో న్యాయస్థానం ఆమెకు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. -
కాపీరాయుళ్లను పట్టుకోడానికి డ్రోన్లు
పిల్లలు పరీక్షల్లో కాపీ కొట్టకుండా చూడాలంటే ఏం చేస్తారు? ఇన్విజిలేటర్లతో పాటు ప్రత్యేకంగా ఫ్లయింగ్ స్క్వాడ్ లాంటి ఏర్పాట్లు ఉంటాయి కదూ. కానీ చైనాలో మాత్రం ఏకంగా విద్యార్థుల మీద నిఘా కోసం డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. మధ్య చైనాలోని లుయాంగ్ ప్రాంతలో గల అధికారులు ఈ హైటెక్ పద్ధతిలో విద్యార్థులను పర్యవేక్షిస్తున్నారు. సాధారణంగా డ్రోన్లు ఎగురుతుంటే కొంత శబ్దం వస్తుంది. కానీ ఇలా కాపీరాయుళ్లను పసిగట్టే డ్రోన్లు మాత్రం అస్సలు చప్పుడే చేయవట. ప్రతియేటా చైనాలో దాదాపు 90 లక్షల మంది టీనేజర్లు 'గావోకావో' అనే ప్రవేశ పరీక్ష రాస్తారు. ఎవరైనా రహస్యంగా ఇయర్ఫోన్లు పెట్టుకుని రాసినా, అత్యాధునిక పరికరాలతో హైటెక్ కాపీ కొట్టేందుకు ప్రయత్నించినా ఇవి రేడియో సిగ్నళ్ల ద్వారా ఇట్టే పట్టేస్తాయి. ఏకబిగిన ఇవి అరగంట పాటు గాల్లో ఎగురుతాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ పరీక్షల్లో అక్రమార్కులను పట్టుకోవడం కష్టమైపోతోందని చైనా అధికారులు ఈ కొత్త ప్రయత్నం మొదలుపెట్టారు. విద్యార్థులు ప్రత్యేకమైన పెన్నులు తెచ్చేవాళ్లు. అవి క్వశ్చన్ పేపర్ల ఫొటోలు తీసి, బయట కావల్సిన వాళ్లకు పంపేవి. అక్కడివాళ్లు రహస్యమైన ఇయర్‌ఫోన్ ద్వారా సమాధానాలు అందించేవాళ్లు. ఇప్పుడు డ్రోన్ల పుణ్యమాని వాళ్ల ఆటలు సాగవు. -
పరీక్షల్లో కాపీకొడుతూ దొరికేసిన ఐజీ
ఆయనో సీనియర్ పోలీసు అధికారి. ఆయనకు మాస్టర్ ఆఫ్ లా చదవాలని అనిపించింది. అయితే, పరీక్షలకు కష్టపడి చదివి.. రాసే ఓపిక, తీరిక రెండూ లేవు. అందుకే కాపీ కొట్టాలనుకున్నారు. కానీ, పరీక్ష హాల్లో దొరికిపోయారు. దాంతో ఆయనను బయటకు పంపేశారు. కేరళలోని త్రిసూర్ రేంజి ఐజీ టీజే జోస్ సెయింట్ పాల్స్ కాలేజిలో కాన్స్టిట్యూషనల్ లా పేపర్ సప్లిమెంటరీ పరీక్ష రాస్తున్నారు. అంటే, ఆయన అంతకుముందు రాసిన పరీక్షలో ఫెయిలయ్యారన్న మాట. దూరవిద్య పద్ధతిలో ఎల్ఎల్ఎం చదువుతున్న ఆయన.. ఉదయం 10 గంటలకు పరీక్షకు హాజరయ్యారు. కానీ 11.30 ప్రాంతంలో ఆయన ఆన్సర్ షీట్ల మధ్యలో చీటీ పెట్టుకుని కాపీ కొడుతుండగా ఇన్విజిలేటర్ పట్టేసుకున్నారు. వెంటనే ఇన్విజిలేటర్ ఆయనను బయటకు పంపి, కాలేజి మేనేజర్‌కు, ఎక్స్టర్నల్ ఎగ్జామినర్‌కు చెప్పారని.. తాము ఈ విషయాన్ని మహాత్మా గాంధీ యూనివర్సిటీకి కూడా తెలియజేశామని కాలేజి వైస్ ప్రిన్సిపాల్ పీటర్ తెలిపారు. అయితే ఐజీ మాత్రం తాను కాపీ కొట్టానన్న విషయాన్ని అంగీకరించలేదు. పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగా, తాను రాయడం 12 గంటలకే అయిపోయిందని, అందుకే బయటకు వచ్చేశానని, కాపీ ప్రసక్తిగానీ, తన వద్ద నుంచి పేపర్లు లాక్కోవడం గానీ జరగనేలేదని ఆయన అన్నారు. మంగళవారం నాడు జరిగే పరీక్షకు కూడా హాజరవుతానని ధీమాగా చెప్పారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా తనను వివరణ కోరగా ఇదే విషయం చెప్పానన్నారు.