పరీక్షల టైంలో విద్యార్ధులు కాపీ కొట్టకుండా టీచర్లు వెయ్యి కళ్లతో కాపేసుంటారు. ఐనా! కొందరుంటారులే.. అబ్బో కాపీ కొట్టడానికి మామూలు తెలివితేటాలు చూపించరు. ఇలా కూడా కాపీ కొడతారా అనే రేంజిలో ఉంటాయి మరి పథకాలు. అసలే కరోనా కాలంలో అంతంత మాత్రపు అత్తెసురు చదువులతో ఊగిసలాడుతుంటే, కొంతమంది విద్యార్ధులు ఎలాగోల పాస్ అయితే చాలు దేవుడా అన్నట్లు పరిస్థితులను తమకనుగునంగా ఎలా మార్చుకుంటున్నారో ఈ వీడియోపై జస్ట్ ఓ శాంపిల్ లుక్కెయ్యండి.
క్లాస్ రూంలో మాస్కులు ధరించి ఎగ్జాం రాస్తున్న విద్యార్ధులు ఈ వీడియోలో కనిపిస్తారు. వీళ్లలో ఓ విద్యార్ధి మాస్కులోపల స్లిప్ పెట్టి దానిని చూసి పరీక్ష రాయడం కనిపిస్తుంది. ఐతే వెనుక కూర్చున్న విద్యార్ధి ఆశ్చర్యంతో నవ్వడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. సామాజిక మాద్యమాల్లో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతుంది. కపీ ఇలా కూడా జరుగుతుందని ఎవరూహించరని ఒకరు, కరోనా విపత్తును అవకాశంగా మార్చుకున్నాడని మరొకరు ఇలా నెటిజన్లు సరదాగా వేల కామెంట్లు చేస్తున్నారు. విద్యార్ధుల భవిష్యత్తుకు అది అంత మంచి మార్గం కాదనేది మనందరికీ తెలిసిందే! ఏదిఏమైనా కష్టపడేవారి కోసమే రాజమార్గాలు తెరచుకుంటాయనేది నిత్యసత్యం. మీరేమంటారు...?
చదవండి: Omicron Outbreak: ఇప్పట్లో స్కూళ్లు తెరిచేదే లేదు!
Comments
Please login to add a commentAdd a comment