మరోసారి సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న కచ్చా బాదమ్‌ భుబన్‌.. వీడియో వైరల్‌ | Kacha Badam Fame Sings New Song About His Car Accident | Sakshi
Sakshi News home page

Kacha Badam Singer: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌.. కచ్చా బాదమ్‌ ఫేమ్‌ భుబన్‌ మరో పాట.. సోషల్‌ మీడియా షేక్‌

Published Sun, Mar 6 2022 12:09 PM | Last Updated on Sun, Mar 6 2022 3:21 PM

Kacha Badam Fame Sings New Song About His Car Accident - Sakshi

కచ్చా బాదమ్‌ సాంగ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన భుబ‌న్ బ‌ద్యాక‌ర్ కచ్చా బాదమ్‌ సాంగ్‌.. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా ఫేమస్‌ అయిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ రీల్స్‌తో నెటిజన్లు ఈ పాటను ఆస్వాదించారు.

వీధుల్లో తిరుగుతూ పల్లీలు అమ్ముకుంటూ సరదాకు పాడిన ఓ సాంగ్‌ తనను ఓవర్‌ నైట్‌ సెలబ్రిటీని చేసింది. దీంతో భుబన్‌ ఒక్కసారిగా స్టార్‌ అయిపోయాడు. కచ్చా బాదమ్‌ సాంగ్‌ తర్వాత భుబన్‌కు చాలా ఆఫర్స్‌ వచ్చాయి. ఈ క్రేజ్‌లో అవతారమే పూర్తిగా మారిపోయింది. తాజాగా కోల్‌కతాలోని ఓ పోష్‌ క్లబ్‌లో అతగాడు రాక్‌స్టార్‌ అవతారంలో ప్రదర్శన కూడా ఇవ్వడం చూసి  అందరూ షాకయ్యారు.

ఈ క్రమంలో దక్కిన కొద్దిపాటి రెమ్యునరేషన్‌తో సెకండ్‌ హ్యాండ్‌ కారును కొనుగోలు చేశాడు. ఇప్పటి వరకు బాగానే ఉన్నా.. ఒక్కసారిగా అదృష్టం అడ్డం తిరిగింది. కారు నేర్చుకుంటున్న క్రమంలో అతడు యాక్సిడెంట్‌కు గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతడికి ఛాతీలో బలమైన గాయమైంది. దీంతో ఆసుపత్రిలో చేరి చిక్సిత పొందాడు. అనంతరం డిశ్చార్జ్ అయ్యాడు. ఆసుపత్రి నుంచి బయటకు రావడమే తరువాయి.. మరోపాటతో మళ్లీ సోషల్‌ మీడియాను తనవైపు తిప్పుకున్నారు. ‘నా కొత్త కారు’ అంటూ భుబ‌న్ పాడిన పాట ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. 

ఇక ‘కచ్చా బాదామ్‌’ భూబన్‌ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని లక్ష్మీనారాయణపూర్‌ కురల్జురీ గ్రామం.. భూబన్‌ స్వస్థలం. భార్యతో పాటు ముగ్గురు పిల్లల తండ్రైన భూబన్‌.. పచ్చి పల్లీలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. పాత సామాన్లు, పగిలిపోయిన వస్తువులకు బదులు పల్లీలు ఇస్తూ.. వాటిని జంక్‌ షాపుల్లో అమ్మి ఆ వచ్చే 200, 300 వందల రూపాయలతో జీవనం కొనసాగించేవాడు. ఆ తర్వాత యూట్యూబ్‌ ఛానెల్స్‌, ఇన్‌స్టా రీల్స్‌తో కచ్చా బాదామ్‌ ఫేమస్‌ అయ్యింది. మొదట్లో సాంగ్‌ వైరల్‌ అయినప్పుడు.. తనకు క్రెడిట్‌ దక్కలేదని గోల చేసిన భూబన్‌, తీరా అది దక్కాక పూర్తిగా మారిపోయాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement