Manchu Lakshmi And Family Maldives Vacation, Photos Goes Viral In Social Media - Sakshi
Sakshi News home page

స్వర్గంలా ఉందన్న మంచు లక్ష్మీ.. ఫోటోలు వైరల్‌

Published Fri, Jan 22 2021 12:24 PM | Last Updated on Fri, Jan 22 2021 2:21 PM

Manchu Lakshmis Maldives Vacation With Family Photo Viral  - Sakshi

షూటింగులతో బిజీబిజీగా ఉండే సినీ సెలబ్రిటీలు ఏమాత్రం వీలు కుదిరినా సేదతీరడానికి విదేశాలకు వాలిపోతుంటారు. ఫ్యామిలీతోనో, ఫ్రెండ్స్‌తోనే సరదాగా వెకేషన్‌ ట్రిప్‌కు వెళ్తుంటారు. ఈ మధ్యకాలంలో దక్షిణాదితో పాటు బాలీవుడ్‌ సెలబ్రిటీలు సైతం ఈ మధ్య ఎక్కువగా మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తున్నారు. అలా వెళ్లిన వారిలో రానా-మిహిక, నిహారిక-చైతన్య,కాజల్-కిచ్లు జంటలు కూడా ఉన్నాయి. దీంతో ప్రస్తుతం మాల్దీవులు సెలబ్రిటీలకు ఫేవరెట్‌ ప్లేస్‌గా మారినట్లు తెలుస్తోంది. తాజాగా మంచు ఫ్యామిలీ కూడా మాల్దీవుల్లో వాలిపోయారు. మంచు మోహన్‌బాబు, ఆయన భార్య నిర్మల సహా మంచు లక్ష్మీ తన కూతురు, భర్త ఆండీ శ్రీనివాసన్ అక్కడి అందాలను ఆస్వాదిస్తున్నారు. చదవండి :  (ఇక్కడ ఒక్క రాత్రికి రూ. 58 లక్షలు)

మాల్దీవులు భూతలస్వర్గంగా ఉందని.. ఆకాశం, బీచ్‌లతో ఇక్కడి ప్రకృతి సోయగాలు ఎంతో బాగున్నాయని మంచు లక్ష్మీ పేర్కొంది. దీనికి సంబంధించి పలు ఫోటోలను సోషల్‌మీడియాలో పంచుకుంది. ఇక డైలాగ్‌కింగ్‌ మోహన్‌బాబు తన సతీమణితో సముద్రపు ఒడ్డున దిగిన ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. యంగ్‌లుక్‌లో కనిపిస్తున్నారంటూ మోహన్‌బాబు దంపతులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తన్నారు.  చదవండి : (మజా మాల్దీవ్స్‌ )

ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement