తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ గుర్తింపు దక్కించుకున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఈ భామ వ్యాకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల బాలీవుడ్‌లో ఆమె నటించిన చిత్రాలు ఛత్రివాలి, డాక్టర్ జి విడుదలయ్యాయి. ఈ సినిమాల్లో విభిన్న పాత్రల్లో రకుల్ నటించింది. తాజాగా మాల్దీవుల్లో ఉన్న ఓ ఫోటోలను సోషల్ మీడియాతో పంచుకుంది. ఆ ఫోటోలు కాస్తా వైరలవుతున్నాయి.
బాలీవుడ్‌లో ఆమె నటించిన 'థ్యాంక్ గాడ్'మూవీ విడుదలైన తర్వాత మాల్దీవులకు చెక్కేసింది ఈ భామ. ఇన్‌స్టాలో తన చిత్రాలను షేర్ చేస్తూ.. 'కాస్ ఐలాండ్ లైఫ్ వైబ్' అంటూ రాసుకొచ్చింది. సూర్యాస్తమయం వేళ ఉన్న మరో చిత్రాన్ని పంచుకుంటూ.. 'సూర్యాస్తమయం, నక్షత్రాల రాత్రులు, సంతోషకరమైన అమ్మాయి' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
దీపావళికి విడుదలైన థ్యాంక్ గాడ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా నటించారు. బాలీవుడ్‌లో డాక్టర్ జి, కట్ పుట్లి, రన్‌వే 34, అటాక్ సినిమాల్లో నటించింది ఈ భామ. రకుల్ ప్రీత్ సింగ్ డైరీ, ఛత్రివాలి, ఇండియన్- 2లో సినిమాల్లో కూడా నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment