ఫోన్ తలగడ కింద పెట్టుకుంటే అంతే!
న్యూయార్క్: మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా. అయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పడుకునే ముందు స్మార్ట్ ఫోన్ కొంచెం దూరంగా పెట్టే పడుకుంటే మంచిది. ఇక చార్జింగ్ పెట్టినయితే తీసేయడం మర్చిపోవద్దు. తన స్మార్ట్ ఫోన్ కు చార్జింగ్ పెట్టి నిద్రపోయిన ఓ అమెరికా బాలిక తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఉత్తర టెక్సాస్ లో ఈ ఘటన గురించి స్థానిక మీడియా వెల్లడించింది.
13 ఏళ్ల బాలిక తన సామ్సంగ్ గెలాక్సీ ఎస్4 ఫోన్కు చార్జింగ్ పెట్టి తలకింద పెట్టుకుని నిద్రపోయింది. చాలాసేపటి తర్వాత కాలిన వాసన రావడంతో ఆ బాలిక మేల్కోంది. అప్పటికే తలగడకు కొద్దిగా మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన బాలిక అక్కడి నుంచి దూరంగా జరిగింది. ఎక్కువగా చార్జింగ్ పెట్టడం బ్యాటరీ వేడెక్కి మంటలంటుకుని ఉండొచ్చని బాలిక తండ్రి తెలిపారు. అయితే ఫోన్ తలగడ కింద పెట్టుకోవద్దని సామ్సంగ్ కోరింది.