
ఓ కంటెంట్ క్రియేటర్ ఏకంగా నడిరోడ్డుపై దిండు వేసుకుని హాయిగా పడుకున్నాడు. జీబ్రా క్రాసింగ్ వద్ద అతడ్ని చూసి అందరూ షాక్ అయ్యారు.
యూట్యూబ్ ఛానల్‌కు సబ్‌స్క్రైబర్లను, సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకునేందుకు కొందరు ఏం చేసేందుకైనా వెనుకాడటం లేదు. ఒక్కోసారి వారు చేసే పనులు చూస్తే చిర్రెత్తిపోతుంది. కనీస ఇంగితజ్ఞానం కూడా లేకుండా ప్రవరిస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ఘటనే దుబాయ్‌లో జరిగింది. ఓ కంటెంట్ క్రియేటర్ ఏకంగా నడిరోడ్డుపై దిండు వేసుకుని హాయిగా పడుకున్నాడు. జీబ్రా క్రాసింగ్ వద్ద అతడ్ని చూసి అందరూ షాక్ అయ్యారు. అతను అడ్డంగా ఉండటంతో వాహనదారులు వాహనాలను నిలిపివేశారు. దీంతో కాసేపు అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
يالله خذوا !!! 🙂 pic.twitter.com/4aTcWlPWiF
— 🇦🇪العليـــاء (@AlAliaLanjawi) October 4, 2022
మనోడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. రోడ్డుపై పడుకుని ట్రాఫిక్‌కు ఇబ్బంది కల్గించడమేగాక, తన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నం చేసినందుకు అరెస్టు చేశారు. అతను ఆసియాకు చెందినవాడని చెప్పారు.
చదవండి: 80 ఏళ్ల వృద్ధులు స్కై డైవింగ్‌తో... గిన్నిస్ రికార్డు