దిండు 45,00,000 రూపాయలు | Worlds Most Expensive Pillow Costs Nearly Rs 45 Lakh | Sakshi
Sakshi News home page

దిండు 45,00,000 రూపాయలు

Published Wed, Jun 29 2022 2:40 AM | Last Updated on Wed, Jun 29 2022 9:26 AM

Worlds Most Expensive Pillow Costs Nearly Rs 45 Lakh - Sakshi

అంత డబ్బు పెడితే... ఓ హైఎండ్‌ కార్‌ కొనేయొచ్చు. ఓ మోస్తరు ఇల్లు కొనుక్కోవచ్చు. అలాంటిది ఓ మెత్తకు అంత ధర ఉంటుందా? అని నమ్మలేకపోతున్నారు కదూ! కానీ నిజం. దాని విలువ రూ. 45 లక్షలు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు ఇది. నెదర్లాండ్స్‌కు చెందిన ఓ ఫిజియోథెరపిస్ట్‌ దీన్ని డిజైన్‌ చేశాడు. ఎంత థెరపిస్ట్‌ డిజైన్‌ చేసినా అంత రేటెందుకు అంటే? దాని ధర వెనుక 15 ఏళ్ల కఠోర శ్రమ ఉంది. అంతేకాదు అందులో ఉన్న దూదిని రోబోటిక్‌ మిల్లింగ్‌ మెషీన్‌తో తయారు చేశారు.

నిద్రరాకుండా బాధపడేవారు, వివిధ రకాల మెడ నొప్పులతో ఇబ్బందులు పడేవాళ్లను సైతం ఈజీగా నిద్రపుచ్చేస్తుందీ మెత్త. అంత సౌకర్యంగా ఉంటుంది మరి. అలాగే ఈ దిండును బంగారం, నీలమణులను పొదిగి మరీ తయారు చేశారు. మెత్త కవర్‌ జిప్‌ డిజైన్‌కు నాలుగు వజ్రాలను ఉపయోగించారు. ఇక సాధారణ మాల్స్‌లో ఇచ్చినట్టుగా దీన్ని కవర్‌లో పెట్టి ఇవ్వరు. దానికోసమే ప్రత్యేకంగా రూపొందించిన బ్రాండెడ్‌ బాక్స్‌లో ప్యాక్‌చేసి మరీ ఇస్తారట. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement