కొందరు నిద్రపోయేటప్పుడు గురక తీస్తుంటారు. గాఢనిద్రలో ఎవరు తీసే గురక వారికి తెలియదు గాని, వారితో పాటు ఒకే గదిలో పడుకునేవారికి నిద్రాభంగమవుతుంది. రకరకాల శారీరక సమస్యల వల్ల ఇలా గురక వస్తుంటుంది. గురకను అరికట్టడానికి ఇప్పటి వరకు ప్రత్యేకమైన ఔషధాలు, చికిత్సలు ఏవీ లేవు. అయితే, ఈ స్మార్ట్ తలదిండు గురకను ఇట్టే అరికడుతుందని చెబుతున్నారు.
ఈ స్మార్ట్ దిండును కెనడియన్ కంపెనీ డెరుక్కి తయారు చేసింది. ఇది యాప్ ద్వారా పనిచేస్తుంది. నిద్ర తీరు తెన్నులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, తేడాలు ఉన్నట్లయితే యాప్ ద్వారా సమాచారం అందిస్తుంది. గురక మొదలయ్యే సూచన రాగానే, తల భంగిమను మార్చుకునేలా చేస్తుంది. స్లీప్ ఆప్నియా వంటి వ్యాధులను అరికట్టడానికి ఈ స్మార్ట్ దిండు బాగా ఉపయోగపడుతుంది. ఈ యాంటీ స్నోర్ పిల్లో గురక బాధను 89 శాతం వరకు నివారిస్తుందని తయారీదారులు చెబుతున్నారు. దీని ధర 699 డాలర్లు (రూ.58,212).
ఇవి చదవండి: Children's Story: ఉత్తమ శిష్యుడు! 'మేము సర్వసంగ పరిత్యాగులం'..
Comments
Please login to add a commentAdd a comment