న్యూఢిల్లీ: అస్సెల్ మద్దతు కలిగిన క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్ స్టార్టప్ ‘పిల్లో’ తన కార్యకలాపాలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. జూలై 31 నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. నియంత్రణల పరంగా అనిశ్చితి, కఠిన వ్యాపార పరిస్థితులను ఇందుకు కారణాలుగా పేర్కొంది. సిరీస్ ఏ రౌండ్‌లో 18 మిలియన్ డాలర్లు (రూ.147 కోట్లు) సమీకరించిన ఎనిమిది నెలలకే ఈ సంస్థ చేతులెత్తేయడం గమనార్హం.
‘పిల్లో యాప్ ద్వారా ఇక మీదట సేవలు అందించకూడదనే నిర్ణయం తీసుకున్నామని తెలియజేస్తున్నందుకు విచారిస్తున్నాం’’అని సంస్థ తన యూజర్లకు సమాచారం ఇచ్చింది. యూజర్ల నిధులపై వడ్డీ రాబడి ఇక్కడి నుంచి ఉండదని, రివార్డుల విభాగాన్ని యాక్సెస్ చేసుకోలేరని తెలిపింది. జూలై 31 వరకు క్రిప్టో విత్‌డ్రాయల్, జూలై 7 వరకు బ్యాంక్ విత్‌డ్రాయల్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment