తొలిముద్దును చెరిపేసుకుంటానన్న మోలీ కింగ్ | Mollie King wants to erase 'first kiss' memory | Sakshi
Sakshi News home page

తొలిముద్దును చెరిపేసుకుంటానన్న మోలీ కింగ్

Published Mon, Sep 23 2013 7:45 AM | Last Updated on Fri, Sep 1 2017 10:59 PM

తొలిముద్దును చెరిపేసుకుంటానన్న మోలీ కింగ్

తొలిముద్దును చెరిపేసుకుంటానన్న మోలీ కింగ్

తన తొలిముద్దు జ్ఞాపకాలను చెరిపేసుకుంటానని చెబుతోంది గాయని మోలీ కింగ్ (26). సాటర్ డేస్ బ్యాండ్లో గాయనిగా ప్రసిద్ధి చెందిన ఈ ముద్దుగుమ్మకు ఆ తొలిముద్దు ఏమాత్రం నచ్చలేదట. అది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తోందని ఇప్పుడు చెబుతోంది. ఇంతకీ ఆ తొలి ముద్దు అనుభవం ఎప్పుడు, ఎవరితో అయ్యిందో చెప్పట్లేదు గానీ అది మాత్రం నచ్చలేదని అంటోంది.

ఈ విషయం బ్లిస్ పత్రికలో ప్రముఖంగా వచ్చింది. ''నా తొలి ముద్దు అనుభవం ఏమాత్రం బాగోలేదు. అందుకే.. దాన్ని చెరిపేసుకోవాలనుకుంటున్నాను. ఆ అబ్బాయి నా మీదకు దాడి చేసినట్లుగా దూకాడు. అందుకే అది నాకు నచ్చలేదు'' అని ఆమె చెప్పింది. ప్రస్తుతం మ్యూజిక్ ఆల్బంల నిర్మాత జోర్డాన్ ఓమ్లీతో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఈ ముద్దుగుమ్మ ఇంతకుముందు ప్రముఖ మోడల్ డేవిడ్ గాండీతో కలిసుండేది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement