కిమ్ కర్దాషియన్, డొనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఫొటో)
వాషింగ్టన్ : హాలీవుడ్ నటి, రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ అభ్యర్థనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన్నించారు. కర్దాషియన్ గ్రాండ్ మదర్ అలైస్ మేరీ జాన్సన్ (63)కు ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించారు. దీనిపై స్పందించిన నటి కిమ్.. బెస్ట్ న్యూస్ ఎవర్ అని బుధవారం రాత్రి ట్వీట్ చేశారు. డ్రగ్సరాకెట్ కేసులో అరెస్టయిన అలైస్ మేరీ జాన్సన్ రెండు దశాబ్దాలుగా జైలుశిక్ష అనుభవిస్తున్నారు.
కాగా, తన గ్రాండ్ మదర్‌కు క్షమాబిక్ష పెట్టాలని ట్రంప్‌ను ఆమె కోరారు. మే 30న నిందితురాలు మేరీ జాన్సన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె మనవరాలు కర్దాషియన్ అధ్యక్షుడు ట్రంప్‌ను కలుసుకున్నారు. ఇటీవల ట్రంప్ ఓ బాక్సర్‌కు క్షమాబిక్ష ప్రసాదించగా.. తన గ్రాండ్ మదర్‌పై కూడా కనికరం చూపాలని నటి కర్దాషియన్ ట్రంప్‌ను కోరారు. నటి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ట్రంప్.. నిందితురాలు అలైస్ మేరీ జాన్సన్‌కు క్షమాభిక్ష ప్రసాదించారని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇప్పటివరకూ పలు పర్యాయాలు ట్రంప్ అల్లుడు జరేడ్ కుష్నర్ నటి కర్దాషియన్‌తో మేరీ జాన్సన్ కేసు గురించి చర్చించారు. చివరగా నటి కర్దాషియన్ పోరాటం ఫలించడంతో వారి కుటుంబసభ్యులు ట్రంప్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, డ్రగ్స్ రాకెట్ కేసులో 1996లో అరెస్టయిన అలైస్ జాన్సన్‌కు ఎలాంటి పెరోల్ అవకాశం ఇవ్వకుండానే జీవితఖైదు విధించారు.
అలైస్ మేరీ జాన్సన్
Comments
Please login to add a commentAdd a comment