
Kim Kardashian Pete Davidson Break Up After 9 Months Dating: సినీ ఇండస్ట్రీలో మరో బ్రేకప్ చోటుచేసుకుంది. రియాలిటీ స్టార్‌గా పేరు తెచ్చుకుంది కిమ్ కర్దాషియన్. పలు కామెడీ షోలతో, స్టాండప్ కమెడియిన్‌గా పాపులరయ్యాడు పీట్ డేవిడ్‌సన్. వీరిద్దరూ తొమ్మిది నెలలుగా డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కిమ్-పీట్ బ్రేకప్ చెప్పుకుని ఎవరి దారి వారు చూసుకున్నారని హాలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 'కిమ్ కర్దాషియన్, పీట్ డేవిడ్‌సన్ విపరీతమైన షెడ్యూల్స్ కారణంగా సంబంధాన్ని కొనసాగించలేకపోతున్నారు. షెడ్యూల్స్ ద్వారా రిలేషన్‌షిప్‌ను కొనసాగించడం సవాలుగా మారింది. అందుకే విడిపోయి స్నేహితులుగా మారాలని నిర్ణయించుకున్నారు' అని మీడియా సంస్థలు పేర్కొన్నట్లు సమాచారం.
కాగా 2021 అక్టోబర్‌లో నిర్వహించిన సాటర్డే నైట్ లైవ్‌లో కిమ్ కర్దాషియన్ అతిథిగా హాజరైంది. ఈ కార్యక్రమంలో కిమ్‌కు పీట్ డేవిడ్‌సన్‌తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. తర్వాత ఈ సంవత్సరం జరిగిన మెట్ గాలా ఈవెంట్‌లో వీరిద్దరూ రెడ్ కార్పెట్‌పై నడిచి తమ రిలేషన్‌షిప్‌ను బహిర్గతంగా వ్యక్తపరిచారు. తాజాగా వీరు 9 నెలల డేటింగ్‌కు స్వస్తి పలికి బ్రేకప్ చెప్పుకున్నారు. ప్రస్తుతం పీట్ డేవిట్‌సన్ ఆస్ట్రేలియాలో 'విజార్డ్స్' షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు సమాచారం.
చదవండి: సినిమాలకు దూరంగా ఉన్నా.. ఇది చాలా అవసరం: మంచు మనోజ్
హీరోగా, నిర్మాతగా అభినందనీయం.. కానీ ఆ ట్యాగ్?
ప్రమాదం నుంచి బయటపడిన నేచురల్ స్టార్ నాని!
Comments
Please login to add a commentAdd a comment