Hollywood Comedian
-
మరో బ్రేకప్.. షెడ్యూల్స్ కారణంగా విడిపోయిన లవ్‌బర్డ్స్!
Kim Kardashian Pete Davidson Break Up After 9 Months Dating: సినీ ఇండస్ట్రీలో మరో బ్రేకప్ చోటుచేసుకుంది. రియాలిటీ స్టార్‌గా పేరు తెచ్చుకుంది కిమ్ కర్దాషియన్. పలు కామెడీ షోలతో, స్టాండప్ కమెడియిన్‌గా పాపులరయ్యాడు పీట్ డేవిడ్సన్. వీరిద్దరూ తొమ్మిది నెలలుగా డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కిమ్-పీట్ బ్రేకప్ చెప్పుకుని ఎవరి దారి వారు చూసుకున్నారని హాలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 'కిమ్ కర్దాషియన్, పీట్ డేవిడ్సన్ విపరీతమైన షెడ్యూల్స్ కారణంగా సంబంధాన్ని కొనసాగించలేకపోతున్నారు. షెడ్యూల్స్ ద్వారా రిలేషన్‌షిప్‌ను కొనసాగించడం సవాలుగా మారింది. అందుకే విడిపోయి స్నేహితులుగా మారాలని నిర్ణయించుకున్నారు' అని మీడియా సంస్థలు పేర్కొన్నట్లు సమాచారం. కాగా 2021 అక్టోబర్‌లో నిర్వహించిన సాటర్డే నైట్ లైవ్‌లో కిమ్ కర్దాషియన్ అతిథిగా హాజరైంది. ఈ కార్యక్రమంలో కిమ్‌కు పీట్ డేవిడ్సన్తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. తర్వాత ఈ సంవత్సరం జరిగిన మెట్ గాలా ఈవెంట్లో వీరిద్దరూ రెడ్ కార్పెట్‌పై నడిచి తమ రిలేషన్‌షిప్‌ను బహిర్గతంగా వ్యక్తపరిచారు. తాజాగా వీరు 9 నెలల డేటింగ్‌కు స్వస్తి పలికి బ్రేకప్ చెప్పుకున్నారు. ప్రస్తుతం పీట్ డేవిట్సన్ ఆస్ట్రేలియాలో 'విజార్డ్స్' షూటింగ్లో పాల్గొంటున్నట్లు సమాచారం. చదవండి: సినిమాలకు దూరంగా ఉన్నా.. ఇది చాలా అవసరం: మంచు మనోజ్ హీరోగా, నిర్మాతగా అభినందనీయం.. కానీ ఆ ట్యాగ్? ప్రమాదం నుంచి బయటపడిన నేచురల్ స్టార్ నాని! -
హాలీవుడ్ సీనియర్ నటుడు మృతి
అమెరికన్ నటుడు, ప్రఖ్యాత హాలీవుడ్ కమెడియన్ జెర్రీ లూయిస్ మరణించారు. దీర్ఘకాలముగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ 91 ఏళ్ల హాస్యనటుడు తన నివాసమైన లాస్‌వెగాస్‌లో ఆదివారం ఉదయం 9.15 గంటలకు తుది శ్వాస విడిచారు. ‘ది బెల్ బాయ్’, ‘జెర్రీ లూయిస్’, సిండెర్‌ఫెల్లా, ‘ది నాటీ ఫ్రోఫెసర్’ పాత్రలతో జెర్రీ లూయిస్ స్టార్ కమెడియన్‌గా గుర్తింపుపొందారు. 1950లో ద బ్రాష్ ప్లాస్టిక్ కామిక్‌తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. యూరప్‌లోని ఐదు దేశాల నుంచి 8 సార్లు ఉత్తమ డైరెక్టర్‌గా అవార్డు అందుకున్నారు. జెర్రీ తన 18వ ఏట సింగర్ పట్టి పాల్మర్‌ను కలుసుకున్న పదిరోజులకే పెళ్లాడాడు. 1944-82 మధ్య సాగిన వీరి దాంపత్యానికి ఐదుగురు సంతానం కాగా మరోకరిని దత్తత తీసుకున్నారు. జెర్రీ చిన్న కుమారుడు 2009లో డ్రగ్స్‌కు అడిక్ట్ అయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక అనారోగ్యంతో జెర్రీకి1983లోనే ఓపెన్ హార్ట్ సర్జరీ జరగగా 1992లో ప్రొస్టెట్ కెన్సర్‌కు శస్త్ర చికిత్స జరిగింది. జెర్రీ 2003 నుంచి పూర్తిగా మందులపై ఆధారపడే జీవించారు. 2006లో ఒక సారి గుండెపోటు రాగా మరణించే వరకు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు.