మరో సారి వార్తల్లోకి 'సెల్ఫీ' గర్ల్! | Don't miss Kardashian in her book of selfies | Sakshi
Sakshi News home page

మరో సారి వార్తల్లోకి 'సెల్ఫీ' గర్ల్!

Published Sat, Aug 9 2014 10:57 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 AM

మరో సారి వార్తల్లోకి 'సెల్ఫీ' గర్ల్!

మరో సారి వార్తల్లోకి 'సెల్ఫీ' గర్ల్!

న్యూయార్క్:అమెరికా సెక్సీ మోడల్ కిమ్ కర్దాషియాన్ పేరు విననివారుండరంటే నమ్మండి. తన అందచందాలతో యాత్ ని ఒక ఊపు ఊపారు. కర్దాషియాన్ తన మనసులోని మాటలను కొన్నింటిని తరుచు బయటపెడుతూ అభిమానులకు దగ్గరగానే ఉంటోంది. అయితే మొన్నామధ్య 'సెల్పిష్' బుక్ తో వస్తున్నానని ప్రకటించిన కర్దాషియాన్.. ప్రస్తుతం ఆ పనిలోనే నిమగ్నమైందట. ఆ సెల్పీ బుక్ ను తప్పకుండా అభిమానుల ముందుకు తీసుకువస్తానని గారాలు పోతుంది ఈ 33 ఏళ్ల చిన్నది.

 

అసలు తనకు ఈ ఐడియా ఎలా వచ్చిందో కూడా వ్యక్తికరీంచింది. ఒకానొక వాలైంటెన్స్ డే సందర్భంలో చూసిన 'సెక్సీ పొలారాయిడ్'ఫోటోలే తన మదిలో ఆలోచనలో రేకిత్తించాయని.. దాంతోనే  ఆ పుస్తకాన్ని రాయడానికి శ్రీకారం చుట్టడానికి పూనుకొంటున్నట్లు తెలిపింది. అయితే వచ్చే ఏడాది కానీ అభిమానుల చెంతకు చేరదు. ఈ 'సెల్ఫిష్' పుస్తకం ఏప్రిల్ 7 వ తేదీ నాటికి విడుదల చేస్తానని కిమ్ స్పష్టం చేసింది. 352 పేజీలు ఉన్న ఈ పుస్తకం ఖరీదు దాదాపు రూ.1,200.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement