
'ఆ పెళ్లి నాకు ఓ జీవితపాఠం'
న్యూఢిల్లీ: క్రిస్ హాంప్రస్ ను పెళ్లి చేసుకోవడం.. ఆపై విడాకులు తీసుకోవడం తనకు ఓ జీవితపాఠమని హాలీవుడ్ శృంగార తార, రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్ అభిప్రాయపడింది. 2011వ సంవత్సరం ఆగస్టు నెలలో హాంప్రస్ ను పెళ్లాడిన ఈ అమ్మడు.. అదే సంవత్సరం అక్టోబర్ లోనే విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. కేవలం 72 రోజుల పాటు మాత్రమే హాంప్రస్ తో వైవాహిక జీవితాన్ని పంచుకున్న కర్దాషియాన్ తనకు అదో జీవితపాఠంగా మిగిలిపోతుందని పేర్కొంది.
' ప్రతీ ఒక్కరి జీవితంలో ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆ తరహాలోనే ఇది కూడా. వాటి నుంచి గుణపాఠం నేర్చుకోవాలి' అని కిమ్ వయ్యారాలు ఒలకబోసింది. పెళ్లి అయిన వెంటనే కిమ్ విడాకులు కోరినా.. హాంప్రస్ తో తెగతెంపులకు 2013 ఏప్రిల్ నెల వరకూ ఆగాల్సి వచ్చింది. ప్రస్తుతం సింగర్ కెన్యే వెస్ట్ ను పెళ్లాడటానికి ఈ సెక్సీ సుందరి రెడీ అవుతోంది.