వింత వింత చేష్టలు... గెటప్‌లతో ఎప్పుడూ న్యూస్‌లో ఉండే అమెరికన్ రియాల్టీ షో స్టార్ కిమ్ కర్దాషియన్ ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటి వరకు తన అందచందాలతో అలరించిన అమ్మడు... లేటెస్ట్‌గా హెయిర్ కలర్ మార్చి, ఆ పిక్చర్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేసింది. ఇక చెప్పేదేముంది..! ఒకటే లైకులు... షేర్లు... కామెంట్లు! ‘వాస్తవానికి మడోనా హెయిర్ కలర్ నన్ను బాగా ఇంప్రస్ చేసింది. ఆ ప్రభావంతోనే నేనూ జుట్టు రంగు మార్చుకున్నా. ప్లాటినమ్ హెయిర్‌డ్ మడోనా పిక్చర్ ఎప్పుడూ నా కంప్యూటర్ రిఫరెన్స్ ఫోల్డర్‌లో ఉంటుంది. ఈ లుక్ కోసం చాలా రోజులు వేచి చూడాల్సి వచ్చింది. ఇలాంటివి ఇంప్లిమెంట్ చేయడానికి ప్యారిస్ ఫ్యాషన్ వీక్ కంటే పెద్ద సందర్భం ఏముంటుంది! కానీ... ఈ నిర్ణయం ముందుగా ప్లాన్ చేసుకున్నది కాదు. లాస్ట్ మినిట్‌లో తీసుకున్నది’ అంది కిమ్!
కాండీ టచ్!
Published Wed, Mar 11 2015 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM
Advertisement
Advertisement