
ప్రసవమైన 13వారాలకే నగ్నంగా సెల్ఫీ!
లాస్‌ఏంజిల్స్: ధైర్యమంటే తనదేనని టీవీ రియాల్టీ స్టార్ కిమ్ కర్దాషియన్ మరోసారి నిరూపించింది. ఇటీవలే ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఈ ముద్దుగుమ్మ నగ్నంగా సెల్ఫీ దిగి.. సోషల్ మీడియాకు కిర్రెక్కించింది. ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ సెల్ఫీలో కిమ్ ఒంటిపై నూలుపోగులేకుండా దర్శనమిచ్చింది. మార్బుల్ బాత్రూమ్‌లో అద్దం ముందు నిలబడి తన అందాలను స్వయంగా సెల్ఫీలో బంధించింది ఈ అమ్మడు. అయితే, ఈ ఫొటోలో ప్రైవేటు అంగాలు పూర్తిగా కనబడకుండా రెండు బ్లాక్ మార్క్స్ తో కవర్ చేసింది. 'నేను ఏమీ ధరించకపోవడం మీకిష్టం కదా.. లోల్' అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్ పెట్టింది.
గతంలోనూ కిమ్ కర్దాషియన్ ఇలాంటి హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అయితే ప్రస్తుతం పెట్టిన సెల్ఫీ కొన్నివారాల కిందటిదై ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో ఆమె పెట్టుకున్న లాంటి విగ్గే .. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లోనూ కిమ్ ధరించింది. కిమ్, కెన్యే వెస్ట్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ దంపతులకు రెండేళ్ల కూతురు నార్త్ ఉండగా.. గత డిసెంబర్‌లో సెయింట్ అనే మగపిల్లాడు జన్మించాడు.