
టాప్ సెర్చ్!
రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ పాపులారిటీ అంతకంతకూ పెరిగిపోతోంది. టీవీ షోల్లోనే కాదు... సెర్చ్ ఇంజిన్‌లో కూడా అమ్మడు దూసుకుపోతోంది. మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజిన్ ‘బింగ్’లో ఈ చిన్నదాని కోసం తెగ వెతికేశారట నెటిజన్లు. ఈ దెబ్బకు బింగ్ 2014 టాప్ సెర్చింగ్ లిస్ట్‌లో కర్దాషియనే టాప్! హాలీవుడ్ మెగాస్టార్లను వెనక్కి నెట్టి మరీ ఈ పొజిషన్ దక్కించుకుంది కిమ్. ఈ టాప్ లిస్టులో బియోన్స్, మిలీ సిరస్, క్యాటీ పెర్రీ, జస్టిన్ బైబర్, జోన్ రివర్స్, జెనిఫర్ లోపెజ్, కిండాల్ జెన్నర్, కాలె కువాకో, రాబిన్ విలియమ్స్ వరుసగా తరువాతి స్థానాల్లో ఉన్నారు.